Pakistan Bomb Blast: పాక్‌లో తెహ్రీక్‌ ఏ తాలిబన్ల ఆత్మాహుతి దాడి.. క్వెట్టాలో ఐదుగురు సైనికుల మృతి..

|

Sep 05, 2021 | 6:02 PM

ఉగ్రవాదులకు పుట్టినిల్లు పాకిస్తాన్‌కు తగినశాస్తి జరుగుతోంది. వరసుగా టెర్రర్‌ దాడులతో పాకిస్తాన్‌ వణికిపోతోంది. క్వెట్టాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఐదుగురు పాకిస్తాన్‌ సైనికులు చనిపోయారు.

Pakistan Bomb Blast: పాక్‌లో తెహ్రీక్‌ ఏ తాలిబన్ల ఆత్మాహుతి దాడి.. క్వెట్టాలో ఐదుగురు సైనికుల మృతి..
Pakistan Bomb Blast
Follow us on

ఉగ్రవాదులకు పుట్టినిల్లు పాకిస్తాన్‌కు తగినశాస్తి జరుగుతోంది. వరసుగా టెర్రర్‌ దాడులతో పాకిస్తాన్‌ వణికిపోతోంది. క్వెట్టాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఐదుగురు పాకిస్తాన్‌ సైనికులు చనిపోయారు. 20 మంది పాక్‌ జవాన్లకు ఈ దాడిలో తీవ్రగాయాలయ్యాయి. ఆర్మీ చెక్‌పోస్ట్‌ను టార్గెట్‌ చేస్తూ ఈ దాడి జరిగింది. బైక్‌పై వచ్చిన సూసైబ్‌ బాంబర్‌ తనను తాను పేల్చుకున్నాడు. తెహ్రీక్‌ తాలిబన్‌ ఆఫ్‌ పాకిస్తాన్‌ సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. టీపీటీ ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడ్డారని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఆరోపించారు.

పాకిస్థాన్‌కు చెందిన ఆత్మాహుతి బాంబర్ ఆదివారం దేశంలోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో తనను తాను పేల్చుకున్నాడు. ఈ పేలుడులో స్పాట్‌లోనే కనీసం ఐదుగురు భద్రతా సిబ్బంది మరణించగా… ఆస్పత్రిలో మరో 20 చికిత్స పొందుతున్నారు. క్వెట్టాలోని మస్తుంగ్ రోడ్‌లోని ఫ్రాంటియర్ కార్ప్స్ (ఎఫ్‌సి) చెక్‌పోస్ట్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని క్వెట్టా పోలీసు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ అజార్ అక్రమ్ వెల్లడించారు.

పేలుడులో మరణించినవారిలో  ఎక్కువ మంది ఎఫ్‌సికి చెందినవారు. ఇది ప్రావిన్స్‌లో ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే ఏర్పాటు చేసిన ఫోర్స్‌గా అక్రమ్ తెలిపారు. ప్రాణనష్టం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. నిషేధిత తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (టిటిపి) ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఓ ప్రకటన చేసింది. ఈ సంస్థ కార్యకలాపాలను అడ్డుకునేందుకు పాకిస్తాన్ సర్కార్ తాలిబాన్ల వైపు చూస్తోంది. పేలుడు కారణమైన సంస్థ సభ్యులు ఆఫ్ఘనిస్తాన్‌లో దాక్కున్నాట్లుగా పాకిస్తాన్ రక్షణ సంస్థ గుర్తించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్న సమయంలో పాకిస్తాన్‌లో ఈ ఘటన చోటు చేసుకోవడం పెద్ద చర్చకు దారి తీస్తోంది.

ఇవి కూడా చదవండి: ట్రాఫిక్‌లో హారన్ శబ్ధాలు ఇబ్బంది పెడుతున్నాయా.. ఇక ఆ సౌండ్ పొల్యూషన్‌కు వినిపించదు ఎందుకో తెలుసా..

Mosquito-Plant: ఈ చిట్కాలు పాటిస్తే.. మీ ఇంట్లో ఒక్క దోమ కూడా లేకుండా పరార్..