రూ.10.8కోట్లు.. నాలుగు మేకలు.. పాక్ ప్రధాని ఆస్తుల వివరాలు

| Edited By:

Jul 03, 2019 | 8:18 AM

పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌తో పాటు ప్రముఖ రాజకీయ నేతలకు సంబంధించిన ఆస్తుల వివరాలను ఆ దేశ ఎన్నికల సంఘం మంగళవారం వెల్లడించింది. అందులో ఇమ్రాన్‌కు రూ.10.8కోట్ల ఆస్తులున్నాయని ప్రకటించింది. ఇక ఆయనకు ఉన్న బనీ గలా ఎస్టేట్‌ తనకు కానుకగా వచ్చిందని ఇమ్రాన్ ఖాన్ తెలిపినట్లు ఈసీ ప్రకటించింది. అలాగే ఆయన భార్య బుర్షా బీబీకి ఇదే ఎస్టేట్‌లో సొంత ఇల్లు, పాక్ పట్టాన్, ఒకారాలో భూమి ఉన్నట్లు పేర్కొంది. ఇమ్రాన్‌కు మూడు ఫారిన్ కరెన్సీ […]

రూ.10.8కోట్లు.. నాలుగు మేకలు.. పాక్ ప్రధాని ఆస్తుల వివరాలు
Follow us on

పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌తో పాటు ప్రముఖ రాజకీయ నేతలకు సంబంధించిన ఆస్తుల వివరాలను ఆ దేశ ఎన్నికల సంఘం మంగళవారం వెల్లడించింది. అందులో ఇమ్రాన్‌కు రూ.10.8కోట్ల ఆస్తులున్నాయని ప్రకటించింది. ఇక ఆయనకు ఉన్న బనీ గలా ఎస్టేట్‌ తనకు కానుకగా వచ్చిందని ఇమ్రాన్ ఖాన్ తెలిపినట్లు ఈసీ ప్రకటించింది. అలాగే ఆయన భార్య బుర్షా బీబీకి ఇదే ఎస్టేట్‌లో సొంత ఇల్లు, పాక్ పట్టాన్, ఒకారాలో భూమి ఉన్నట్లు పేర్కొంది. ఇమ్రాన్‌కు మూడు ఫారిన్ కరెన్సీ ఖాతాలు ఉన్నాయని.. అలాగే 150ఎకరాల వ్యవసాయ భూమి, రూ.50వేలు విలువ చేసే నాలుగు మేకలు ఉన్నట్లు తెలిపింది.

ఇక పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలవాల్ భుట్టో- జర్దారీ రాజకీయ నాయకుల్లో అత్యధికంగా రూ.150కోట్ల విలువైన ఆస్తుల్ని కలిగి ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. అలాగే నగదు అక్రమ చలామణి కేసుల్లో ప్రస్తుతం కస్టడీలో ఉన్న పాక్ మాజీ అధ్యక్షుడు అసీఫ్ అలీ జర్దారీకి రూ.66కోట్లు ఉన్నాయని పేర్కొంది.