హిందువుపై పాక్ క్రికెట్‌ టీంలో వివక్ష.. సంచలన నిజాలు బయటపెట్టిన అక్తర్

| Edited By:

Dec 27, 2019 | 3:21 PM

పాకిస్థాన్‌లో హిందువుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. అందుకు అనేక సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా పాకిస్థాన్‌లో హిందువులు ఎలాంటి వివక్షను ఎదుర్కొంటారన్నది.. సాక్షాత్తు ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ వెల్లడించారు. పాక్ జట్టులో హిందువు అయిన స్పిన్నర్‌ డానిష్‌ కనేరియాపట్ల తమ వారు ఏవిధంగా వివక్ష చూపించేవారో తెలిపారు. టీం సభ్యులందరూ హిందువైన డానిష్ కనేరియాతో కలిసి భోజనం చేసేందుకు అయిష్టంగా ఉండేవారని.. అతనికి దూరంగా ఉండి తినేవారన్నారు. అంతేకాదు… […]

హిందువుపై పాక్ క్రికెట్‌ టీంలో వివక్ష.. సంచలన నిజాలు బయటపెట్టిన అక్తర్
Follow us on

పాకిస్థాన్‌లో హిందువుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. అందుకు అనేక సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా పాకిస్థాన్‌లో హిందువులు ఎలాంటి వివక్షను ఎదుర్కొంటారన్నది.. సాక్షాత్తు ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ వెల్లడించారు. పాక్ జట్టులో హిందువు అయిన స్పిన్నర్‌ డానిష్‌ కనేరియాపట్ల తమ వారు ఏవిధంగా వివక్ష చూపించేవారో తెలిపారు. టీం సభ్యులందరూ హిందువైన డానిష్ కనేరియాతో కలిసి భోజనం చేసేందుకు అయిష్టంగా ఉండేవారని.. అతనికి దూరంగా ఉండి తినేవారన్నారు. అంతేకాదు… జట్టులో ప్రాంతీయతత్వం కూడా ఉండేదని.. ఎవరు పంజాబీ, ఎవరు కరాచీ, ఎవరు పెషావర్ అని జట్టులో చర్చించుకునేవారన్నారు. ఇక హిందువైన డానిష్ పరిస్థితి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని.. జట్టులో నేను ఆడుతున్న సమయంలో దీనిని ఖండించే వాడినన్నారు.

మ్యాచ్ విన్నర్‌గా నిలిచే డానిష్ కనేరియాపై ఇలాంటి వివక్ష సరైందికాదని అంటే.. తన మాటల్ని ఎవరూ వినేవారు కాదని వాపోయాడు. అంతేకాదు.. తమ కెప్టెన్ కూడా కనేరియాతో కలసి తినడానికి ఇష్టపడేవాడు కాదన్న విషయాన్ని షోయబ్ అక్తర్ బయటపెట్టాడు. ఇదంతా డానిష్ హిందువు కావడంతోనే జట్టునుంచి వివక్షను ఎదుర్కొన్నాడన్నాడు. మరికొందరైతే.. హిందువైన కనేరియా ఇంకా మనదేశంలో ఎలా ఉన్నాడంటూ తప్పుపట్టేవారన్న విషయాన్ని కూడా అక్తర్ తెలిపాడు.

అక్తర్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలపై డానిష్ కనేరియా కూడా స్పందించారు. అక్తర్ చెప్పినవన్నీ నిజాలేనని.. పాక్ క్రికెటర్లు మతవివక్ష చూపుతారని పేర్కొన్నారు. కొందరు తనపై హిందువన్న కారణంతో వివక్ష చూపారని.. త్వరలోనే వారి పేర్లన్నీ బయటపెడుతానన్నారు. అప్పట్లో ఈ అంశాలపై మాట్లాడే ధైర్యం సరిపోలేదని కనేరియా వాపోయాడు. ఓ సెలబ్రిటీ హోదా ఉన్న క్రికెటర్‌పైనే ఇంతటి వివక్ష ఉంటే.. ఇక సామాన్య హిందువుల పరిస్థితి పాకిస్థాన్‌లో ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు.