యుద్ధం పరిష్కారం కాదు… ద్వైపాక్షిక చర్చలకు సిద్ధమే: ఖురేషీ

| Edited By:

Sep 01, 2019 | 12:28 PM

భారత ప్రభుత్వం జమ్మూ కశ్మీర్‌కు గల స్వయం ప్రతిపత్తి ఆర్టికల్ 370, 37ఏ రద్దు చేయడంపై పాకిస్తాన్ గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. ఎందుకంటే, ఆర్టికల్ 370ని అడ్డుపెట్టుకొని వారు కశ్మీర్‌లో ఇష్టానుసారంగా వ్యవహరించేవారు. 35ఏ అధికరణను అడ్డు పెట్టుకొని కశ్మీరీ యువతుల్ని పెళ్లాడడం, శ్రీనగర్‌లో మకాం వేయడం లాంటివి చేసేవారు. తమ ఇష్టారాజ్యంగా తిరిగే రాష్ట్రంపై ఇండియా పూర్తి పట్టు సాధించే సరికి వారికి ఎక్కడ లేని కోపం కట్టలు తెంచుకుంటోంది. ఉగ్రవాదులకు అడ్డాగా మారిన […]

యుద్ధం పరిష్కారం కాదు... ద్వైపాక్షిక చర్చలకు సిద్ధమే: ఖురేషీ
Follow us on

భారత ప్రభుత్వం జమ్మూ కశ్మీర్‌కు గల స్వయం ప్రతిపత్తి ఆర్టికల్ 370, 37ఏ రద్దు చేయడంపై పాకిస్తాన్ గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. ఎందుకంటే, ఆర్టికల్ 370ని అడ్డుపెట్టుకొని వారు కశ్మీర్‌లో ఇష్టానుసారంగా వ్యవహరించేవారు. 35ఏ అధికరణను అడ్డు పెట్టుకొని కశ్మీరీ యువతుల్ని పెళ్లాడడం, శ్రీనగర్‌లో మకాం వేయడం లాంటివి చేసేవారు. తమ ఇష్టారాజ్యంగా తిరిగే రాష్ట్రంపై ఇండియా పూర్తి పట్టు సాధించే సరికి వారికి ఎక్కడ లేని కోపం కట్టలు తెంచుకుంటోంది.

ఉగ్రవాదులకు అడ్డాగా మారిన కశ్మీర్‌పై ఎలాంటి చర్య తీసుకోవాలన్నా ఈ అధికరణ అడ్డం వచ్చి ఇన్నాళ్లు భారత్ మిన్నకుండిపోయింది. పార్లమెంట్‌లోని ఉభయ సభల్లో కశ్మీర్‌పై పెట్టిన బిల్లులు భారీ మెజారిటీ పాసవగా, వెంటనే రాష్ట్రపతి ఆమోద ముద్ర పడడం చకచకా జరిగిపోయాయి. ఈ చర్యపై ఆశ్చర్యపడిన పాక్ ఒక్కసారిగా భారత్‌పై తమ ఉక్రోషాన్ని వెల్లగక్కుతూనే ఉంది. ఐక్యరాజ్యసమితిలో మొర పెట్టుకున్నా, అమెరికా, చైనాలతో తమ భాద పంచుకున్నా అందరూ మూకుమ్మడిగా ఇండియాకు మద్ధతు నిలిచారు. దీంతో, ఎక్కడా పాలుపోని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దీనికి యుద్ధమే సరైన మార్గమనీ, కనీసం ప్రజల మద్ధతు లేకుండా ఇలాంటి చర్యలకు ఉపక్రమించడమేంటని మండిపడ్డారు. రెండు అణ్వస్త్ర దేశాలు యుద్ధం చేస్తే ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చన్నారు.

ఈ అంశంపై స్పందించిన పాక్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషి మాట్లాడుతూ.. యుద్ధం ఈ సమస్యకు పరిష్కారం కాదనీ, ఇండియా కశ్మీర్ విషయాన్ని తమ అంతర్గత విషయమనడం సరికాదన్నారు. ఇది అంతర్జాతీయ అంశమనీ, దీనిపై సరైన చర్చలు జరగాలని అన్నారు.