Pakistan: పాకిస్తాన్ సుప్రీంకోర్టుకు బాంబు బెదిరింపు కాల్.. ఆరా తీయగా.. చివరికి తేలిన అసలు విషయం..

| Edited By: Ravi Kiran

Feb 05, 2022 | 6:12 PM

Pakisthan: పాకిస్థాన్ సుప్రీంకోర్టు(Suprme Court)లోని కరాచీ రిజిస్ట్రీ(Karachi Registry)కి బాంబు పెట్టినట్టు ఫోన్‌కాల్‌ వచ్చింది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. సంఘటన గురించి..

Pakistan: పాకిస్తాన్ సుప్రీంకోర్టుకు బాంబు బెదిరింపు కాల్.. ఆరా తీయగా.. చివరికి తేలిన అసలు విషయం..
Pakistan Supreme Court
Follow us on

Pakistan: పాకిస్థాన్ సుప్రీంకోర్టు(Suprme Court)లోని కరాచీ రిజిస్ట్రీ(Karachi Registry)కి బాంబు పెట్టినట్టు ఫోన్‌కాల్‌ వచ్చింది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు, పాక్ రేంజర్లు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే భవనాన్ని ఖాళీ చేయించారు. సుప్రీంకోర్టులోని రిజిస్ట్రీ ఆఫీసులో బాంబు పెట్టినట్లుగా గుర్తు తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చిందని కరాచీ పోలీసులు స్థానిక మీడియాకు వెల్లడించారు. కరాచీలో అత్యంత రద్దీగా ఉండే రహదారిపై పాకిస్థాన్ సుప్రీం కోర్ట్ రిజిస్ట్రీ ఉంది.

బాంబు రిమూవ్ స్క్వాడ్‌తో పాటు పోలీసులు ,రేంజర్స్ సిబ్బంది భారీ సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే బాంబు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భవనం నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భవనాన్ని పూర్తిగా ఖాళీ చేయించారు. అయితే తనిఖీల్లో ఎటువంటి బాంబ్ లభించలేదని పోలీసులు తెలిపారు. ఎవరైనా సరదాగా లేదా కలకలం సృష్టించేందుకు ఇలాంటి ఫేక్ కాల్ చేసి ఉంటారని ఓ పోలీసు అధికారి అరై న్యూస్‌తో చెప్పుకొచ్చారు.

గతేడాది కూడా బాంబు గురించి తప్పుడు సమాచారం:

గతేడాది డిసెంబర్‌లో ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి ఫరీద్ ఎక్స్‌ప్రెస్ అనే ప్యాసింజర్ రైలులో బాంబు పెట్టినట్లు చెప్పాడు. ఈ రైల్లో భారీ సంఖ్యలో ప్రజలు ప్రయాణిస్తుంటారు. అదే సమయంలో రైలులో బాంబు ఉందన్న సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌తో రైలు మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే చివరికి వారికేం లభించలేదు. దీనితో ఇది కేవలం ఫేక్ కాల్ అని పోలీసులు తేల్చారు. అంతేకాదు ఆ ఫేక్ కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Also Read:  అక్కడ ఎండిన మామిడాకులకు ఫుల్ డిమాండ్.. కిలో రూ. 150కి కొనుగోలు.. రైతులు హర్షం..