విమాన శకలాల్ని దోచుకున్నారట.. ఇవ్వండంటూ బతిమాలుతున్న పాక్‌ ప్రభుత్వం..

| Edited By:

May 28, 2020 | 7:27 PM

పాకిస్థాన్‌లో గత వారం నివాస ప్రాంతాల్లో ఓ విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 97 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానంలో ఉన్న ప్రయాణికులతో పాటు.. కుప్పకూలిన సమయంలో కింద ఉన్న ప్రజలు కూడా కొందరు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఇప్పుడు పాక్ ప్రభుత్వానికి కొత్తరకం తలనొప్పి స్టార్ట్‌ అయ్యింది. ఆ విమానం కుప్పకూలిన తర్వాత.. దాని శకలాలు చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో అందులో పనికి వచ్చే పరికరాలను స్థానికులు […]

విమాన శకలాల్ని దోచుకున్నారట.. ఇవ్వండంటూ బతిమాలుతున్న పాక్‌ ప్రభుత్వం..
Follow us on

పాకిస్థాన్‌లో గత వారం నివాస ప్రాంతాల్లో ఓ విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 97 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానంలో ఉన్న ప్రయాణికులతో పాటు.. కుప్పకూలిన సమయంలో కింద ఉన్న ప్రజలు కూడా కొందరు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఇప్పుడు పాక్ ప్రభుత్వానికి కొత్తరకం తలనొప్పి స్టార్ట్‌
అయ్యింది. ఆ విమానం కుప్పకూలిన తర్వాత.. దాని శకలాలు చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో అందులో పనికి వచ్చే పరికరాలను స్థానికులు దోచుకెళ్లారట. అయితే అందులో ముఖ్యమైన పరికరాలు, వాయిస్ రికార్డ్‌తో పాటు ఇతర పరికరాలు కనిపించకపోవడంతో తలపట్టుకుంటుంది పాక్ ప్రభుత్వం. విమానానికి సంబంధించిన పరికరాలను తీసుకెళ్లిన వారు.. వాటిని తిరిగి ఇచ్చెయ్యాలంటూ వేడుకొంటోంది. కాగా, ఈ విమానాన్ని పదిహేనేళ్ల క్రితం ఫ్రాన్స్‌ నిర్మించింది. దీంతో ఈ విమానం కుప్పకూలడంతో.. ఫ్రాన్స్‌ విమాన సంస్థ కూడా దర్యాప్తులో భాగంగా
ఘటన జరిగిన ప్రదేశంలో పర్యటిస్తోంది.