బెలుచిస్తాన్ బొగ్గు గనిలో చిక్కుకున్న 11 మంది బాలలు

| Edited By: Pardhasaradhi Peri

Jul 16, 2019 | 10:25 AM

బెలుచిస్తాన్‌లోని ఓ బొగ్గుగనిలో 11 మంది బాలలుచిక్కుకున్నారు. బెలుచిస్తాన్‌లో క్వెట్టా ప్రాంతంలో ఉన్న దిగరీ బొగ్గుగనిలో దాదాపు 12 మంది బాలలు కూలీలుగా పనిచేస్తున్నారు. వీరు గనిలో పనిచేస్తున్న సమయలో ప్రమాదకరమైన మీథేన్ వాయువులు వ్యాపించాయి. దీంతో బాలలంతా అందులో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ వీరిని కాపాడేందుకు ప్రయత్నిస్తోంది. అయితే 15 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత ఒక బాలుడ్ని ప్రాణాలతో రక్షించారు. మిగతా 11 మందిని రక్షించే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. […]

బెలుచిస్తాన్ బొగ్గు గనిలో చిక్కుకున్న 11 మంది బాలలు
Follow us on

బెలుచిస్తాన్‌లోని ఓ బొగ్గుగనిలో 11 మంది బాలలుచిక్కుకున్నారు. బెలుచిస్తాన్‌లో క్వెట్టా ప్రాంతంలో ఉన్న దిగరీ బొగ్గుగనిలో దాదాపు 12 మంది బాలలు కూలీలుగా పనిచేస్తున్నారు. వీరు గనిలో పనిచేస్తున్న సమయలో ప్రమాదకరమైన మీథేన్ వాయువులు వ్యాపించాయి. దీంతో బాలలంతా అందులో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ వీరిని కాపాడేందుకు ప్రయత్నిస్తోంది. అయితే 15 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత ఒక బాలుడ్ని ప్రాణాలతో రక్షించారు. మిగతా 11 మందిని రక్షించే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

ఇదిలా ఉంటే ప్రతి ఏడాది బెలుచిస్తాన్ గనుల్లో 200 మందికి పైగా మరణిస్తూ ఉంటారని, వందల సంఖ్యలో గాయాలపాలవుతున్నారని పాకిస్తాన్ మైన్స్ లేబర్ ఫెడరేషన్ తెలిపింది.