హాంకాంగ్ లో ఫిషింగ్ బోటు, ఆయిల్ ట్యాంకర్ ఢీ

| Edited By:

Mar 12, 2019 | 2:06 PM

హాంకాంగ్: ఫిషింగ్ బోటు, ఆయిల్ ట్యాంకర్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. హాంకాంగ్‌లోని లమ్మా ఐలాండ్‌లో ఇవాళ ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో చేపల వేటకు వెళ్లిన నౌక ముంపునకు గురైంది. అయితే ఆయిల్ ట్యాంకర్‌పై ఉన్న 13 మంది సురక్షితంగా ఉన్నారు. ఫిషింగ్ బోటులో ఉన్నవారు ఎవరైనా గల్లంతయ్యారా అనేది ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్యూ టీం ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగిస్తుందని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు […]

హాంకాంగ్ లో ఫిషింగ్ బోటు, ఆయిల్ ట్యాంకర్ ఢీ
Follow us on

హాంకాంగ్: ఫిషింగ్ బోటు, ఆయిల్ ట్యాంకర్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. హాంకాంగ్‌లోని లమ్మా ఐలాండ్‌లో ఇవాళ ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో చేపల వేటకు వెళ్లిన నౌక ముంపునకు గురైంది. అయితే ఆయిల్ ట్యాంకర్‌పై ఉన్న 13 మంది సురక్షితంగా ఉన్నారు. ఫిషింగ్ బోటులో ఉన్నవారు ఎవరైనా గల్లంతయ్యారా అనేది ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్యూ టీం ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగిస్తుందని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. కాగా గత జనవరిలో హాంకాంగ్‌లోనే ఆయిల్‌ట్యాంకర్‌లో మంటలు చెలరేగిన ఘటనలో…ఓ వ్యక్తి మృతి చెందగా..ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు.