లండన్‌ వీధుల్లో ఘనంగా బోనాల జాతర

| Edited By:

Jul 14, 2019 | 5:08 AM

తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల జాతర లండన్‌లో వైభవంగా జరిగింది. టాక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో తెలుగువారు హాజరై లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపు నిర్వహించారు. ఈ సంబరాల్లో పోతురాజు వేషధారణ ప్రవాసులతో పాటు స్థానికులను కూడా మంత్ర ముగ్ధులను చేసింది. తెలంగాణలో జరుపుకున్నట్లు సంప్రదాయబద్ధంగా పూజలు చేసి, మేళా తాళాల మధ్య హన్సలౌ వీధుల్లో తొట్టెల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. దీంతో లండన్ వీధులు కొత్త శోభను సంతరించుకున్నాయి. 

లండన్‌ వీధుల్లో ఘనంగా బోనాల జాతర
Follow us on