పారిస్‌లో కాలిబూడిదయిన ప్రముఖ చర్చి

| Edited By:

Apr 16, 2019 | 11:41 AM

ఫ్రాన్స్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పారిస్‌లో ప్రసిద్ధి చెందిన పురాతన చర్చి మంటల్లో కాలిబూడిదయ్యింది. శతాబ్ధాల నాటి నోట్రేడామే చర్చి అగ్నికి ఆహుతి కావడం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది. ఆధునీకరణ పనులు చేస్తుండగా అగ్నిప్రమాదం జరిగింది. మంటల్లో పూర్తిగా కాలిన చర్చి భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. 8వ శతాబ్దంలో నిర్మించిన ఈ నోట్రేడామే కేథడ్రిల్ చర్చికి ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉంది. మంటలను అదుపు చేయడానికి వందలాది మంది అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. […]

పారిస్‌లో కాలిబూడిదయిన ప్రముఖ చర్చి
Follow us on

ఫ్రాన్స్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పారిస్‌లో ప్రసిద్ధి చెందిన పురాతన చర్చి మంటల్లో కాలిబూడిదయ్యింది. శతాబ్ధాల నాటి నోట్రేడామే చర్చి అగ్నికి ఆహుతి కావడం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది. ఆధునీకరణ పనులు చేస్తుండగా అగ్నిప్రమాదం జరిగింది. మంటల్లో పూర్తిగా కాలిన చర్చి భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. 8వ శతాబ్దంలో నిర్మించిన ఈ నోట్రేడామే కేథడ్రిల్ చర్చికి ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉంది.

మంటలను అదుపు చేయడానికి వందలాది మంది అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. పక్క బిల్డింగ్‌లకు మంటలు విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. హెలికాప్టర్లను కూడా అధికారులు వినియోగించారు. నోట్రేడామే చర్చిలో అగ్ని ప్రమాదంపై ఫ్రాన్స్ ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. ఈ ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. అయితే.. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.