హాలీవుడ్‌ మూవీస్‌ చూస్తే చిన్నారులకు 5 ఏళ్ల జైలు శిక్ష.. ఆ దేశ అధ్యక్షుడి సంచలన నిర్ణయం..

|

Feb 28, 2023 | 7:08 PM

అతడి తీరే అంత, ఎప్పుడు.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోనని అందరూ భయపడుతుంటారు. పిచ్చి పిచ్చి నిర్ణయాలు, అణు పరీక్షల పేరుతో హడలెత్తిస్తుంటాడు.. ఇప్పటికే అతను ఎవరో మీకు అర్థమైపోయినట్లుంది కదూ.! అవును మీరు అనుకుంటోంది నిజమే అతను మరెవరో కాదు..

హాలీవుడ్‌ మూవీస్‌ చూస్తే చిన్నారులకు 5 ఏళ్ల జైలు శిక్ష.. ఆ దేశ అధ్యక్షుడి సంచలన నిర్ణయం..
Representative Image
Follow us on

అతడి తీరే అంత, ఎప్పుడు.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోనని అందరూ భయపడుతుంటారు. పిచ్చి పిచ్చి నిర్ణయాలు, అణు పరీక్షల పేరుతో హడలెత్తిస్తుంటాడు.. ఇప్పటికే అతను ఎవరో మీకు అర్థమైపోయినట్లుంది కదూ.! అవును మీరు అనుకుంటోంది నిజమే అతను మరెవరో కాదు.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్- జంగ్- ఉన్. అక్కడ కిమ్‌ చెప్పిందే వేదం, చేసిందో రాజ్యం. ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద నిర్ణయాలతో వార్తల్లో నిలిచే కిమ్‌ మరోసారి సంచలన నిర్ణయంతో ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు.

వెస్ట్రన్‌ మీడియాకు తమ దేశంలో అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా కిమ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉత్తర కొరియాలో పిల్లలు హాలీవుడ్‌ మూవీ చూస్తూ పట్టుబడితే ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తామని కిమ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే తల్లిదండ్రులను ఆరు నెలలు కార్మిక కేంద్రాలకు పంపుతామని హెచ్చరించారు. ఇదిలా ఉంటే కిమ్‌ సర్కారు విదేశీ చిత్రాలపై ఇది వరకే నిషేధం విదించినా.. తాజాగా చట్టాలను మరితం కఠినతరం చేశారు. పాశ్చాత్య సంస్కృతికి తన పౌరులు ప్రభావితం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు కిమ్‌ ప్రభుత్వం తెలిపింది.

ఇక ఈ విషయంలో చిన్నారులను చైతన్యం చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని కిమ్‌ సర్కారు స్పష్టం చేసింది. సోషలిస్టు సిద్ధాంతాలపై పిల్లల్లో అవగాహన కల్పించేలా పేరెంట్స్‌ కృషిచేయాలని సూచించింది. ఇక దక్షిణ కొరియా సంస్కృతిని కూడా పాటించకూడదని కిమ్‌ సర్కారు తెలిపింది. అంతేకాకుండా ఒకవేళ విదేశీ చిత్రా సిడీలను స్మగ్లింగ్ చేస్తే ఏకంగా ఉరిశిక్ష విధిస్తామని తెలపడం గమనార్హం.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..