Kim Jong Un: కిమ్ మరో సంచలనం.. వాటిపై నిషేధం.. హద్దు మీరితే ఇక అంతే అంటూ హెచ్చరికలు..

|

May 24, 2021 | 9:39 AM

నార్త్ కొరియా అధ్యక్షుడు, ఆధునిక నియంత కిమ్ జాంగ్ ఉన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాశ్చాత్య పోకడలను తగ్గించడంలో...

Kim Jong Un: కిమ్ మరో సంచలనం.. వాటిపై నిషేధం.. హద్దు మీరితే ఇక అంతే అంటూ హెచ్చరికలు..
Kim Jong-un
Follow us on

Kim Jong Un: నార్త్ కొరియా అధ్యక్షుడు, ఆధునిక నియంత కిమ్ జాంగ్ ఉన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాశ్చాత్య పోకడలను తగ్గించడంలో భాగంగా స్కిన్ జీన్స్, ముల్లెట్ ధరించడంపై నిషేధం విధించారు. అమెరికా తరహ పోకడలు ఉత్తర కొరియా ప్రజలను ఎక్కువ ప్రభావితం చేస్తుండటం యువతలో విప్లవాలు, నిరసనలను కట్టడి చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

దేశంలో చిరిగిపోయిన జీన్స్, టీ షర్ట్స్‌లను యువత వేసుకోకూడదని.. అలాగే ముక్కు, పెదాలపై రింగులు ఉండకూడదని కిమ్ ఆదేశించారు. యువత పాశ్చత్య సంస్కృతికి అలవడితే తన పాలనపై వ్యతిరేకత వస్తుందనే సందేహంతోనే.. వాటిపై కిమ్ నిషేధం విధించారని ప్రపంచ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే నార్త్ కొరియాలో 15 హెయిర్ కట్స్‌కు మాత్రమే అనుమతి ఉంది. మిగతా దేశాలకు సంబంధించిన స్టైల్స్‌, వస్త్రాధారణను పౌరులు అనుసరించకూడదని కిమ్ స్పష్టం చేశారు. జీవనశైలిలో మార్పులు ఆర్థికంగా బలహీనంగా అయిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు. పాశ్చాత్య పోకడలు, హెయిర్‌ స్టైల్‌ విషయంలో ఎవరైనా ప్రభుత్వ ఆంక్షలతో కూడిన మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే.. వారిని పెట్టుబడిదారుల అనుకూలంగా భావించి నిఘా పెడతామని ఉన్ ప్రభుత్వం గతంలో కూడా హెచ్చరించింది.

Also Read:

ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్‌.. గాల్లో పల్టీలు కొట్టిన కారు.. షాకింగ్ దృశ్యాలు..

గగుర్పొడిచే దృశ్యం.. పామును సజీవంగా మింగేస్తోన్న మరో పాము.. వీడియో వైరల్.!

SBI కస్టమర్లకు అలర్ట్.. మీ అకౌంట్ నుంచి రూ.147 డెబిట్ అవుతున్నాయా.? క్లారిటీ ఇచ్చిన బ్యాంక్.!