North Korea: ఉత్తర కొరియాలో ఆకలితో ప్రజలు చచ్చిపోతుంటే.. కోట్లాది రూపాయల వ్యయంతో బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగంలో కిమ్!

|

Oct 24, 2021 | 8:09 PM

ఉత్తర కొరియాపై ఐక్యరాజ్యసమితి స్వతంత్ర నివేదికను విడుదల చేసింది. ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం కారణంగా ప్రజలు ఆత్మహత్యలు చేసుకోవడం ప్రారంభించారని ఆ నివేదికలో పేర్కొన్నారు.

North Korea: ఉత్తర కొరియాలో ఆకలితో ప్రజలు చచ్చిపోతుంటే.. కోట్లాది రూపాయల వ్యయంతో బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగంలో కిమ్!
North Korea
Follow us on

North Korea: ఉత్తర కొరియాపై ఐక్యరాజ్యసమితి స్వతంత్ర నివేదికను విడుదల చేసింది. ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం కారణంగా ప్రజలు ఆత్మహత్యలు చేసుకోవడం ప్రారంభించారని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఈ ఆసియన్ దేశం అంతర్జాతీయ సమాజం నుండి ఇలా ఒంటరిగా ఎన్నడూ లేదని నివేదిక పేర్కొంది. ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ రెండు సంవత్సరాల పాటు దేశ సరిహద్దులను పూర్తిగా మూసివేశారు. తద్వారా దేశంలో కరోనా సంక్రమణ ప్రమాదం తలెత్తకుండా చూసుకోవచ్చని ప్లాన్ చేశారు.

దీని ప్రభావం బలహీనమైన పిల్లలు, వృద్ధులపై ఎక్కువగా ఉంది. భారీ సంఖ్యలో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి స్పెషల్ సూపర్‌వైజర్ థామస్ ఓజియా క్వింటానా ఆరేళ్ల తర్వాత జనరల్ అసెంబ్లీకి తన తుది నివేదికను సమర్పించారు. ఈ విషయమై క్వింటానా మాట్లాడుతూ- ‘దేశంలో కదలికలపై నిషేధం ఉంది. ప్రజలు దేశం వెలుపల వెళ్లలేరు. ప్రజలకు నిత్యావసర సరుకులు అత్యవసరం. లేకపోతే, దేశంలోని అధిక జనాభా ఆకలి ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది. నియంత ఆకలి చావు గురించిన వార్తలు కూడా ఉన్నాయని క్వింటానా నివేదికలో పేర్కొంది.

ఇటీవల బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించారు

దాదాపు 26 మిలియన్ల జనాభాతో ఉత్తర కొరియా ఆసియాలోని అత్యంత పేద దేశాలలో ఒకటి. ఒక నివేదిక ప్రకారం, ఉత్తర కొరియా ప్రతి సంవత్సరం బాలిస్టిక్ క్షిపణుల కోసం దాదాపు 3.2 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 24 వేల కోట్లు) ఖర్చు చేస్తుంది. అది కూడా దేశంలో ఆకలితో అలమటించే పరిస్థితి ఉన్నప్పుడు. కిమ్ జాంగ్ ఉన్ ఇటీవల బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించారు. దీనికి సంబంధించి జపాన్‌లో అలర్ట్ కూడా కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి: Ant Eaters: పొడవాటి నాలుకలతో చీమలను తింటూ జీవించే జీవుల గురించి మీకు తెలుసా?

Terrorism: ఉప్పెనంత విషాదం గుండెల్లో.. కొండంత ఆత్మవిశ్వాసం ఆ చిరునవ్వుల్లో.. ఈ ఫోటో వెనుక హృదయాలను కదిలించే కథ!

Smart Bandage: ఈ స్మార్ట్ బ్యాండేజ్ శరీరంలో గాయాల పరిస్థితిని ఎప్పటికప్పుడు మీకు చెబుతుంది.. ఎలా అంటే..