ఇక అక్కడ బహిరంగంగా ధూమపానం చేస్తే నేరం…!

|

Nov 05, 2020 | 5:51 PM

ఎప్పుడు సంచలనాలకు మారుపేరు అయిన ఉత్తర కొరియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏ చట్టం చేసిన కఠినంగా వ్యవహారించే నార్త్ కొరియా.. ఈ సారి పొగతాత్రాగే వారిపై పడింది

ఇక అక్కడ బహిరంగంగా ధూమపానం చేస్తే నేరం...!
Follow us on

ఎప్పుడు సంచలనాలకు మారుపేరు అయిన ఉత్తర కొరియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏ చట్టం చేసిన కఠినంగా వ్యవహారించే నార్త్ కొరియా.. ఈ సారి పొగత్రాగే వారిపై పడింది. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో ధూమపానంపై నిషేధం విధించింది. ఉత్తర కొరియా పౌరులకు పరిశుభ్రమైన జీవన వాతావరణం అందించడానికి కొన్ని బహిరంగ ప్రదేశాల్లో ధూమపాన నిషేధాన్ని విధిస్తూ ఉత్తర కొరియా పీపుల్ అసెంబ్లీ తీర్మానించింది. కొత్తగా తీసుకు వచ్చిన పొగాకు నిషేధ చట్టం ద్వారా సిగరెట్ల ఉత్పత్తి, అమ్మకాలపై చట్టపరమైన సామాజిక నియంత్రణను కఠినతరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దీనివల్ల ఉత్తర కొరియన్ల జీవితాలను, వాయు కాలుష్యం లేకుండా వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి బహిరంగ ప్రదేశాల్లో ధూమపానంపై నిషేధం విధించామని ప్రభుత్వం ప్రకటించింది. రాజకీయ, సైద్ధాంతిక విద్యాకేంద్రాలు, థియేటర్లు, సినిమా టాకీసులు, వైద్య, ప్రజారోగ్య కేంద్రాల్లో బహిరంగ ధూమపానం నిషేధించాలని తాజా చట్టంలో పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ఉత్తర కొరియాలో ధూమపానం చేసేవారి సంఖ్య ఎక్కువ మంది ఉన్నారు. నార్త్ కొరియా పురుషుల్లో 43.9 శాతం మంది ధూమపానం చేస్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ లెక్కలు చెబుతున్నాయి. కొత్తగా తీసుకువచ్చిన చట్టం ఉల్లంఘనకు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని ఉత్తర కొరియా ప్రభుత్వం హెచ్చరించింది.