రసాయనశాస్త్రంలో ఇద్దరు మహిళా శాస్త్రవేత్తలకు నోబెల్‌

| Edited By:

Oct 07, 2020 | 4:15 PM

రసాయనశాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్‌ బహుమతి ఈ ఏడాది ఇద్దరు మహిళా శాస్త్రవేత్తలను వరించింది. జీనోమ్‌ ఎడిటింగ్‌ విధానంలో చేసిన పరిశోధనకు గానూ

రసాయనశాస్త్రంలో ఇద్దరు మహిళా శాస్త్రవేత్తలకు నోబెల్‌
Follow us on

Nobel Chemistry Prize: రసాయనశాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్‌ బహుమతి ఈ ఏడాది ఇద్దరు మహిళా శాస్త్రవేత్తలను వరించింది. జీనోమ్‌ ఎడిటింగ్‌ విధానంలో చేసిన పరిశోధనకు గానూ ఇమ్మాన్యుయెల్‌ చార్పెంటీర్, జెన్నీఫర్ ఏ డౌడ్నాకు ఈ పురస్కారం లభించింది. కాగా ఇప్పటికే వైద్యశాస్త్రం, భౌతిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతులను ప్రకటించగా.. గురవారం సాహిత్యం, శుక్రవారం శాంతి, సోమవారం ఆర్థిక శాస్త్రం విభాగంలో విజేతలను ప్రకటించనున్నారు.

ఇక హెపటైటిస్ సీ వైరస్‌ని కనుగొన్నందుకు గానూ హార్వే జే అల్టర్, మైఖెల్ హాటన్‌, ఛార్లెస్‌ ఎం. రైస్‌లకు ఈ ఏడాది నోబెల్‌ని ప్రకటించారు. అలాగే కృష్ణబిలంపై పరిశోధనలకు గానూ శాస్త్రవేత్తలు రోజర్‌ పెన్రోస్‌, రిన్‌హార్డ్‌ గెంజెల్‌, ఆండ్రియా గెజ్‌లకు నోబెల్‌ పురస్కారం వరించింది.

Read More:

కరోనాను సీరియస్‌ తీసుకోండి.. వైరస్‌ నుంచి కోలుకున్న అర్జున్‌

జగనన్న విద్యాకానుక ద్వారా 42.43 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి