టైంతో పనిలేని ఐలాండ్‌?

| Edited By:

Jun 23, 2019 | 9:53 PM

అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే నార్వేలోని సొమ్మారాయ్‌ అనే ఐలాండ్‌ వాసులకు ఓ కొత్త ఆలోచన వచ్చింది. ఎందుకంటే అక్కడ మే 18 నుంచి జులై 26 వరకు సూర్యుడు అస్తమించడు. అదే విధంగా నవంబరు నుంచి ఏకంగా జనవరి వరకు సూర్యుడు ఉదయించడు. సూర్యోదయం, అస్తమయంలో ఇలా అసమానతలు ఉండటంతో సంవత్సరంలో దాదాపు ఐదారు నెలలు ఇలానే గడిచిపోతోందట. దీంతో ఇక వాళ్లకి సమయంతో పనేముంది అనుకున్నారేమో… ఆ ఐలాండ్‌లో నివసించే 300మంది ప్రజలు జూన్‌ 13న […]

టైంతో పనిలేని ఐలాండ్‌?
Follow us on

అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే నార్వేలోని సొమ్మారాయ్‌ అనే ఐలాండ్‌ వాసులకు ఓ కొత్త ఆలోచన వచ్చింది. ఎందుకంటే అక్కడ మే 18 నుంచి జులై 26 వరకు సూర్యుడు అస్తమించడు. అదే విధంగా నవంబరు నుంచి ఏకంగా జనవరి వరకు సూర్యుడు ఉదయించడు. సూర్యోదయం, అస్తమయంలో ఇలా అసమానతలు ఉండటంతో సంవత్సరంలో దాదాపు ఐదారు నెలలు ఇలానే గడిచిపోతోందట. దీంతో ఇక వాళ్లకి సమయంతో పనేముంది అనుకున్నారేమో… ఆ ఐలాండ్‌లో నివసించే 300మంది ప్రజలు జూన్‌ 13న ఓ చోట చేరి తమ ఐలాండ్‌ను ‘సమయ రహిత ఐలాండ్’గా ప్రకటించాలని కోరారు. ఇందుకు సంబంధించి ప్రజలంతా ఓ పిటిషన్‌పై సంతకం చేశారు.

నార్వేలోని ప్రకృతి అందాలకు నెలవైన ఐలాండ్లలో ఇదీ ఒకటి. చేపల వేట, పర్యాటకం ద్వారానే ఇక్కడి ప్రజలకు ఆదాయం సమకూరుతుంది. సమయంతో పనిలేకుండా ఎక్కువ కాలం వేటలోనే ఉండి ఎప్పుడోగానీ ఇంటికి రారు. ఇక తమకు సమయంతో పనేముంది అనుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. వీరు పెట్టుకున్న పిటిషన్‌ ప్రకారం దీన్ని టైం ఫ్రీ జోన్‌గా ప్రకటిస్తే ప్రపంచంలో సమయంతో పనిలేకుండా ఉండే ఐలాండ్‌గా ఇది రికార్డు సృష్టిస్తుంది.