దారుణం.. ల్యాండ్‌మైన్ పేలి.. 9మంది విద్యార్ధులు మృతి

| Edited By:

Nov 03, 2019 | 4:15 PM

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. సైనికులను లక్ష్యంగా చేసి పెట్టిన ల్యాండ్‌మైన్ ఒకటి పేలడంతో.. అభం శుభం తెలియని తొమ్మిది మంది పాఠశాల విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయారు. ఈశాన్య ఆఫ్ఘన్‌ ప్రాంతంలోని దార్ఖాడ్‌ జిల్లాలో శనివారం ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రాంతమంతా తాలిబన్ల ఆధీనంలోనే ఉంటుంది. అయితే ఈ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకొచ్చేందుకు సైన్యం ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే సైన్యాన్ని టార్గెట్ చేస్తూ.. తాలిబన్ల ఆధీనంలోని ఓ గ్రామంలో రోడ్డు […]

దారుణం.. ల్యాండ్‌మైన్ పేలి.. 9మంది విద్యార్ధులు మృతి
Follow us on

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. సైనికులను లక్ష్యంగా చేసి పెట్టిన ల్యాండ్‌మైన్ ఒకటి పేలడంతో.. అభం శుభం తెలియని తొమ్మిది మంది పాఠశాల విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయారు. ఈశాన్య ఆఫ్ఘన్‌ ప్రాంతంలోని దార్ఖాడ్‌ జిల్లాలో శనివారం ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రాంతమంతా తాలిబన్ల ఆధీనంలోనే ఉంటుంది. అయితే ఈ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకొచ్చేందుకు సైన్యం ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే సైన్యాన్ని టార్గెట్ చేస్తూ.. తాలిబన్ల ఆధీనంలోని ఓ గ్రామంలో రోడ్డు పక్కన భూమిలో మందుపాతరను పాతిపెట్టారు.

అయితే అటుగా వెళ్తున్న స్కూలు పిల్లలు అడుగువేయడంతో అది పేలిపోయింది. ఈ ఘటనలో 9 మంది పిల్లలు అక్కడికక్కడే చనిపోయారు. వారంతా 7 నుంచి 11 ఏళ్ల వయసుగల వారేనంటూ ఓ అధికారి తెలిపారు. మరోవైపు ఆఫ్ఘనిస్థాన్‌లో గతంలో ఎప్పుడూ లేనంతగా సామాన్యజనం మృతిచెందడంపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్‌ మధ్య దాదాపు పన్నెండు వందల మంది మరణించారని వెల్లడించింది.