Nepal Floods: నేపాల్ శిథిల చిత్రం.. ప్రపంచాన్ని కదిలించిన విచలిత దృశ్యం..

భారీ వరదలతో అతలాకుతలమైన నేపాల్‌ను మరో ముప్పు వెంటాడుతోంది. హిమనదం కూలిపోవడంతో ఏర్పడిన వరదల తర్వాత నేపాల్–టిబెట్ సరిహద్దులో కొత్తగా ఏర్పడిన నీటి సరస్సు పొంగిపొర్లుతుండటంతో మరోసారి ఫ్లాష్‌ఫ్లడ్‌ ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే వందలాది మంది మృతి చెందగా, భారీ సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. రెస్క్యూ బృందాలు సైతం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి

Nepal Floods: నేపాల్ శిథిల చిత్రం.. ప్రపంచాన్ని కదిలించిన విచలిత దృశ్యం..
Nepal flood disaster

Updated on: Aug 28, 2026 | 9:40 PM

విధివంచిత నేపాల్.. కుంగి కృశించిన నేపాల్.. శోకతప్త నేపాల్.. ఏడవడానిక్కూడా శక్తి లేక కుమిలిపోతోంది. మౌనంగానే రోదిస్తోంది. కానీ, నేపాల్ వేదన మాత్రం ప్రపంచం మొత్తానికీ వినిపిస్తోంది. ఇక్కడ కడు విషాదం ఏంటంటే.. నిన్నటిదాకా హిమాలయాలంత అంతులేని విషాదాన్ని కడుపులో మోసిన నేపాల్, మరో ట్రాజెడీ కోసం భీతిగా ఎదురుచూస్తోంది. ఔను.. మరో వరద విపత్తు తప్పదన్న హెచ్చరికలతో మళ్లీ కళ్లు తేలేసింది నేపాల్ దేశం. జల ప్రళయానికి గురైన నేపాల్ నుంచి అత్యంత శ్రమకోర్చి, ప్రాణాలకు తెగించి క్షేత్రస్థాయి కథనాలను జనం ముందుంచే ప్రయత్నం చేసింది TV9. నేపాల్‌లో శిథిలమైన బతుకుల్ని చూసి ప్రపంచం మొత్తం కదిలిపోతోంది. ఎట్లున్న నేపాల్ ఎట్లయ్యింది..? నేల మీద ఇంద్రధనుస్సులా మెరిసిన నేపాల్ అంతలోనే ఎంతటి కళావిహీనంగా మారింది? యునెస్కో గుర్తింపు పొందిన వరల్డ్‌క్లాస్ హెరిటేజ్ మాన్యుమెంట్స్‌తో, ప్రపంచ పర్యాటకుల్ని ఆకట్టుకునే అందమైన ప్రదేశాలతో ఏసియా ఖండంలోనే బ్యూటీ స్పాట్‌గా పేరున్న నేపాల్.. ఇప్పుడు బండబారిపోయి బావురుమంటోంది. శతాబ్దాల పాటు నిర్మించుకున్న అందమైన నగరాలన్నీ జెన్‌జీ మంటల్లో చిక్కి మూడేమూడు రోజుల్లో కాలిబూడిదై గొల్లుమంది నేపాల్. అంతులేని హింసను భరించి ఏడాదైనా గడిచిందో లేదో.. ఇప్పుడు ప్రకృతి విపత్తుకు చిక్కి మళ్లీ శల్యమైపోయింది. నాలుగు నదులు పొంగి, రెండు జిల్లాల్ని...

Loading...
Unable to load recommendations.
Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి