కరోనాను ఎదుర్కునేందుకు మా వంతు సహకారమందిస్తాం: మోదీ

| Edited By:

Feb 09, 2020 | 9:29 PM

చైనాలో రోజు రోజుకు విస్తరిస్తోన్న కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఆ దేశానికి తమ వంతు సహకారాన్ని అందిస్తామని భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ మేరకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు మోదీ లేఖ రాసినట్లు సమాచారం. ఆ లేఖలో కరోనా ప్రభావాన్ని ఎదుర్కొంటున్న చైనా ప్రజలకు సంఘీభావాన్ని తెలిపిన మోదీ.. ఈ మహమ్మారి కారణంగా మరణించిన వారి కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా  భారత పౌరుల్ని భారత్‌కు పంపించేందుకు చైనా ప్రభుత్వం చేసిన కృషిని […]

కరోనాను ఎదుర్కునేందుకు మా వంతు సహకారమందిస్తాం: మోదీ
Follow us on

చైనాలో రోజు రోజుకు విస్తరిస్తోన్న కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఆ దేశానికి తమ వంతు సహకారాన్ని అందిస్తామని భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ మేరకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు మోదీ లేఖ రాసినట్లు సమాచారం. ఆ లేఖలో కరోనా ప్రభావాన్ని ఎదుర్కొంటున్న చైనా ప్రజలకు సంఘీభావాన్ని తెలిపిన మోదీ.. ఈ మహమ్మారి కారణంగా మరణించిన వారి కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా  భారత పౌరుల్ని భారత్‌కు పంపించేందుకు చైనా ప్రభుత్వం చేసిన కృషిని ఆయన కొనియాడారు. అయితే కరోనా వైరస్‌ నేపథ్యంలో.. అక్కడ ఉన్న భారత విద్యార్థులను ప్రభుత్వం స్వదేశానికి రప్పించింది. ఈ నేపథ్యంలో వుహాన్‌ నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో 324 మంది విద్యార్థులు ఇటీవల భారతదేశానికి చేరుకున్నారు. వారికి మానేసర్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇదిలా ఉంటే భారత్‌లో ఇప్పటివరకు ముగ్గురికి కరోనా సోకినట్లుగా సమాచారం.