షాకింగ్‌ న్యూస్‌.. కరోనాతో కోలుకున్నా ఆ ముప్పు తప్పదట

| Edited By:

Aug 09, 2020 | 7:05 PM

ఆత్మస్థైర్యం, వైద్యుల చికిత్సతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కోటికి మందికి పైగా కరోనాను జయించారు. అయితే కరోనా నుంచి కోలుకున్నా

షాకింగ్‌ న్యూస్‌.. కరోనాతో కోలుకున్నా ఆ ముప్పు తప్పదట
Follow us on

Coronavirus side effects: ఆత్మస్థైర్యం, వైద్యుల చికిత్సతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కోటికి మందికి పైగా కరోనాను జయించారు. అయితే కరోనా నుంచి కోలుకున్నా.. వారికి పలు సైడ్ ఎఫెక్ట్‌లు తప్పవని ఇప్పటికే పలువురు శాస్త్రవేత్తలు తేల్చారు. తాజాగా ఓ పరిశోధనలో కరోనా నుంచి కోలుకున్న వారి మెదడుకు తీవ్ర ముప్పు ఉంటుందని తేలింది. కరోనా నుంచి కోలుకున్న వారి మెదడులను మూడు నెలలుగా ఎమ్మారై(మాగ్నెటిక్‌ రెసోనెన్స్‌ ఇమేజింగ్‌) స్కానింగ్ తీయగా, ఈ విషయం బయటపడిందని ఆ పరిశోధనలో పాల్గొన్న వారు వెల్లడించారు. ఈ మేరకు మెడికల్ జర్నల్‌ ద లాన్సెట్‌లో ఓ కథనం ప్రచురితమైంది.

”కరోనా నుంచి కోలుకుంటున్న 55శాతం మందిలో నాడీ సంబంధ సమస్యలను కనుగొన్నాం. అలాగే వారు కోలుకున్నాక వరుసగా మూడు నెలల పాటు ఎమ్మారై స్కానింగ్ చేయగా అందులో ఈ లక్షణాలు కనిపించాయి. కరోనా సోకిన వారు, సోకని వారి మెదడులను పరిశీలిస్తే వాసన కోల్పోవడం, ఙ్ఞాపక శక్తిని కోల్పోవడం వంటి మార్పులను గమనించాం” అని అధ్యయనంలో పాల్గొన్న వారు తెలిపారు. ఒకవేళ కరోనాను పూర్తిగా జయించినప్పటికీ, నాడీ సంబంధ సమస్యలు వారిని ఇబ్బంది పెట్టొచ్చని పరిశోధకులు వివరించారు. దీనిపై మరింత లోతైన అధ్యయనంను చేస్తున్నామని వారు పేర్కొన్నారు. కాగా ఈ అధ్యయనంలో 11 మంది చైనా పరిశోధకులు పాల్గొన్నారు.

Read This Story also: కరోనా మరణాల రేటు అధికంగా ఉన్న జిల్లాలు.. లిస్ట్‌లో హైదరాబాద్‌, మేడ్చల్‌