యెమెన్‌పై సౌదీ ఎయిర్‌ స్ట్రైక్.. 31 మంది మృతి

| Edited By:

Feb 16, 2020 | 4:32 AM

సౌదీ నేతృత్వంలోని దళాలు యెమెన్‌పై ఎయిర్ స్ట్రైక్ చేశాయి. సౌదీకి చెందిన ఓ జెట్ విమానాన్ని కూల్చడంతో.. దాదాపు ముప్పై మందికి పైగా అక్కడి స్థానిక పౌరులు మృతిచెందారు. మరో 12 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి కూడా ధ్రువీకరించింది. ఈ ఘటన యెమెన్‌ నార్త్ ప్రావిన్స్‌లోని అల్‌ జాఫ్‌ ప్రాంతంలో జరిగింది. అయితే హౌతీ తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉన్న పలు సైనిక స్థావరాలను.. టార్గెట్ చేసుకుని .. ఈ వైమానిక దాడులు జరిగాయి. అయితే […]

యెమెన్‌పై సౌదీ ఎయిర్‌ స్ట్రైక్.. 31 మంది మృతి
Follow us on

సౌదీ నేతృత్వంలోని దళాలు యెమెన్‌పై ఎయిర్ స్ట్రైక్ చేశాయి. సౌదీకి చెందిన ఓ జెట్ విమానాన్ని కూల్చడంతో.. దాదాపు ముప్పై మందికి పైగా అక్కడి స్థానిక పౌరులు మృతిచెందారు. మరో 12 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి కూడా ధ్రువీకరించింది. ఈ ఘటన యెమెన్‌ నార్త్ ప్రావిన్స్‌లోని అల్‌ జాఫ్‌ ప్రాంతంలో జరిగింది. అయితే హౌతీ తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉన్న పలు సైనిక స్థావరాలను.. టార్గెట్ చేసుకుని .. ఈ వైమానిక దాడులు జరిగాయి. అయితే అంతకుముందు రోజు యెమెన్‌లో సౌదీకి చెందిన ఓ జెట్‌ విమానం కూలిపోయింది. ఈ ఘటనకు పాల్పడింది తామేనంటూ హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. దీంతో ప్రతీకార దాడులకు సౌదీ దిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎయిర్ స్ట్రైక్ జరిగి ఉండొచ్చని తెలుస్తోంది. అయితే ఈ వైమానిక దాడుల గురించి సౌదీ మాత్రం ఇంత వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.