Monkeypox: లైంగిక సంబంధాల ద్వారా కూడా మంకీపాక్స్‌ వ్యాప్తి.. కీలక విషయాలు వెల్లడించిన డబ్ల్యూహెచ్‌వో

|

Jul 28, 2022 | 9:06 AM

Monkeypox: ప్రపంచ వ్యాప్తంగా పట్టి పీడించిన కరోనా మహమ్మారి ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. కొత్త కొత్త వేరియంట్లతో ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనకు గురి చేసింది. కరోనా ఆంక్షలు..

Monkeypox: లైంగిక సంబంధాల ద్వారా కూడా మంకీపాక్స్‌ వ్యాప్తి.. కీలక విషయాలు వెల్లడించిన డబ్ల్యూహెచ్‌వో
Monkeypox Virus
Follow us on

Monkeypox: ప్రపంచ వ్యాప్తంగా పట్టి పీడించిన కరోనా మహమ్మారి ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. కొత్త కొత్త వేరియంట్లతో ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనకు గురి చేసింది. కరోనా ఆంక్షలు, లాక్‌డౌన్‌, వ్యాక్సినేషన్‌ కారణాల వల్ల ప్రస్తుతం అదుపులో ఉంది. చైనాలో పుట్టిన ఈ వైరస్‌ ప్రపంచ దేశాలకు పాకేసింది. ఇక తాజాగా మరో వైరస్‌ జనాలను ఆందోళనకు గురి చేస్తోంది. అదే మంకీపాక్స్‌. కోతుల నుంచి వ్యాపించే ఈ వైరస్‌ పెద్దగా ప్రమాదం లేకపోయినా ఆందోళనకు గురి చేస్తోంది. దీనిపై ముందుగానే ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను జారీ చేసింది. ముఖ్యంగా మంకీపాక్స్‌ వైరస్‌ ప్రధానంగా లైంగిక సంబంధాల ద్వారా కూడా వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అధినేత టెడ్రోస్‌ అధనామ్‌ తెలిపారు. మంకీపాక్స్ సోకిన పురుషులతో సన్నిహిత శరీరక సంబంధాలకు దూరంగా ఉండటం మంచిదన్నారు. పురుషులలో మంకీపాక్స్‌ లక్షణాలు కనిపించినా.. లైంగికపరంగా దూరంగా ఉండటం మంచిదంటున్నారు

దీనిపై అంతర్జాతీయ పరిశోధనలు జరుగుతున్నాయి. మంకీపాక్స్‌ సోకిన వ్యక్తులతో సన్నిహితంగా లైంగిక సంబంధాలుండటం వల్ల కూడా ఎక్కువగా వ్యాపిస్తుందని అన్నారు. ఈ వ్యాధి సోకిన వారి నోటి నుంచి వచ్చే తుంపర్ల ద్వారా కూడా వ్యాపిస్తుందని చెబుతున్నారు. పురుషులతో సన్నిహితంగా ఉండేవారు కాస్త జాగ్రత్తలు వహించడం ఎంతో ముఖ్యమంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇది పూర్తిగా లైంగిక సంబంధాల ద్వారానే వ్యాపిస్తుందని ఖచ్చితంగా చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు. నివేదికల ప్రకారం.. 78 దేశాలలో 18,000 మంకీపాక్స్‌ కేసులు గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

ఇవి కూడా చదవండి

 


ఇక భారత్‌లో అడుగు పెట్టిన ఈ మంకీపాక్స్‌ ఇప్పటి వరకు నాలుగు కేసులు నమోదు అయ్యాయి. అందులో కేరళలో 3, తెలంగాణలో 1 కేసు నమోదైంది. ఇక నిన్న ఖమ్మంలో కూడా మంకీపాక్స్‌ లక్షణాలతో అనుమానిత వ్యక్తిని గుర్తించారు. అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తు్న్నారు. అలాగే అతని నుంచి రక్త నమూనాలను సేకరించి పూణే ల్యాబ్‌కు తరలించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి