భూమి వైపు దూసుకొస్తోన్న భారీ ఉల్క.. ఢీకొట్టే అవకాశం

| Edited By:

Jul 19, 2019 | 8:53 PM

ఇవాళ భూమికి భారీ ఉల్క ఢీకొట్టే అవకాశం ఉందని నాసా వెల్లడించింది. ఈ ఉల్కకు 2019 ఎన్‌జే2 అని నామకరణం చేయగా.. ఇది ఇవాళ భూమికి అతి దగ్గరగా రానుందని.. దీని వలన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. తాజా సమాచారం ప్రకారం జూన్ 19, రాత్రి 7.53గంటల ప్రాంతంలో ఈ ఉల్క భూగ్రహానికి అతి దగ్గరగా రానుందని వారు పేర్కొన్నారు. 2017అడుగుల వ్యాసార్థంతో.. ఇటలీలో ఉన్న పిసా టవర్‌ కంటే పెద్దదైన […]

భూమి వైపు దూసుకొస్తోన్న భారీ ఉల్క.. ఢీకొట్టే అవకాశం
Follow us on

ఇవాళ భూమికి భారీ ఉల్క ఢీకొట్టే అవకాశం ఉందని నాసా వెల్లడించింది. ఈ ఉల్కకు 2019 ఎన్‌జే2 అని నామకరణం చేయగా.. ఇది ఇవాళ భూమికి అతి దగ్గరగా రానుందని.. దీని వలన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. తాజా సమాచారం ప్రకారం జూన్ 19, రాత్రి 7.53గంటల ప్రాంతంలో ఈ ఉల్క భూగ్రహానికి అతి దగ్గరగా రానుందని వారు పేర్కొన్నారు. 2017అడుగుల వ్యాసార్థంతో.. ఇటలీలో ఉన్న పిసా టవర్‌ కంటే పెద్దదైన ఈ ఉల్క ప్రస్తుతం గంటలకు 30వేల మైళ్ల దూరంతో ప్రయాణిస్తోందని వారు వెల్లడించారు. కాగా ఈ ఉల్కను జూన్ 29నే శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే దీని వలన భూమికి పెద్ద ముప్పు ఏం లేదని మరి కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇవాళ భూమికి దగ్గరగా రానున్న ఎన్‌జే2 ఉల్క.. మళ్లీ 2119 జూలై 7న ఈ ఉల్క భూమికి దగ్గరగా వచ్చే అవకాశాలు ఉన్నాయని స్పేష్ ఏజెన్సీ సెంటర్ తెలిపింది.