Coronavirus vaccine: పొరుగుదేశాలకే ఫస్ట్.. ఈరోజు నుంచి వ్యాక్సిన్ ఎగుమతి.. ముందుగా భూటాన్, మాల్దీవులకు అందజేత

|

Jan 20, 2021 | 12:35 PM

మన దేశంలో తొలి దశ టీకా కార్యక్రమాన్ని సక్సెస్ ఫుల్‌గా నిర్వహించారు. దేశంలోని ప్రజలకు వ్యాక్సిన్ అందిస్తూనే, విదేశాలకు కూడా ఎగుమతి చేయాలని కేంద్రం నిర్ణయం...

Coronavirus vaccine: పొరుగుదేశాలకే ఫస్ట్.. ఈరోజు నుంచి వ్యాక్సిన్ ఎగుమతి.. ముందుగా భూటాన్, మాల్దీవులకు అందజేత
Follow us on

Coronavirus vaccine: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ నివారణకు వ్యాక్సినేషన్ కోసం పలు దేశాలు రెడీ అయ్యాయి. ఇక మన దేశంలో కూడా తొలి దశ టీకా కార్యక్రమాన్ని సక్సెస్ ఫుల్‌గా నిర్వహించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి స్వల్ప అస్వస్థత మినహా ఇప్పటివరకు ఇబ్బందులు కలగలేదు. దీంతో దేశంలోని ప్రజలకు వ్యాక్సిన్ అందిస్తూనే, విదేశాలకు కూడా ఎగుమతి చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

పొరుగు, కీలక భాగస్వామ్య దేశాలకు ఔషధ ఉత్పత్తుల సహకార ఒప్పందంలో భాగంగా ఆరు దేశాలకు భారత్‌ బుధవారం నుంచి టీకాల సరఫరా ప్రారంభించింది.  మొదట భూటాన్ దేశానికీ  1,50,000  సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారుచేసిన కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌లను భూటాన్‌కు ఎగుమతి చేసింది.  ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 1.5లక్షల డోసులను థింపు నగరానికి పంపించింది. మరికొద్దిసేపట్లో మాల్దీవులకు కూడా టీకా డోసుల విమానం బయల్దేరనుంది. ఈ రెండు దేశాలతో పాటు బంగ్లాదేశ్‌, నేపాల్‌, మయన్మార్‌, సీషెల్స్‌ దేశాలకు వ్యాక్సిన్లను సరఫరా చేయనుంది.  ఈ రోజు మొత్తం ఆరుదేశాలకు వ్యాక్సిన్ డోసులను ఎగుమతి చేయనుంది.

ఇక శ్రీలంక, ఆఫ్గనిస్తాన్, మారిషస్ దేశాలకు సంబంధించి రెగ్యులేటరీ క్లియరెన్స్ రావాల్సి ఉన్నది. ఈ క్లియరెన్స్ వస్తే ఆయా దేశాలకు కూడా వ్యాక్సిన్ ను ఎగుమతి చేస్తామని భారత విదేశాంగ శాఖ తెలియజేసింది. మనదేశంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 4,54,049 మందికి వ్యాక్సిన్ అందించారు.

Also Read:  400వ రోజుకి చేరుకున్న అమరావతి రైతుల ఉద్యమం.. సీఎం స్పందించేవరకూ కొనసాగిస్తామని స్పష్టం