ఇన్‌స్టాలో డెత్‌ పోల్‌.. బాలిక సూసైడ్

| Edited By:

May 16, 2019 | 7:48 AM

ఇన్‌స్టాగ్రామ్‌లో పోలింగ్ నిర్వహించుకుని మరీ ఓ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదం మలేషియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సారవాక్‌కు చెందిన 16ఏళ్ల అమ్మాయి.. ఇన్‌స్టాలో . తాను బతకడానికి అర్హురాలినా? కాదా? అంటూ ఓ పోల్ నిర్వహించింది. ఇది చాలా ఇంపార్టెంట్. “డీ/ఎల్‌” లో ఎంచుకోవడంలో నాకు సహకరించండి అంటూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌లో “డీ” అంటే డై (చావడం), “ఎల్” అంటే లీవ్ (జీవించడం) అని అర్థం అని పోలీసుల విచారణలో […]

ఇన్‌స్టాలో డెత్‌ పోల్‌.. బాలిక సూసైడ్
Follow us on

ఇన్‌స్టాగ్రామ్‌లో పోలింగ్ నిర్వహించుకుని మరీ ఓ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదం మలేషియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సారవాక్‌కు చెందిన 16ఏళ్ల అమ్మాయి.. ఇన్‌స్టాలో . తాను బతకడానికి అర్హురాలినా? కాదా? అంటూ ఓ పోల్ నిర్వహించింది.

ఇది చాలా ఇంపార్టెంట్. “డీ/ఎల్‌” లో ఎంచుకోవడంలో నాకు సహకరించండి అంటూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌లో “డీ” అంటే డై (చావడం), “ఎల్” అంటే లీవ్ (జీవించడం) అని అర్థం అని పోలీసుల విచారణలో తేలింది. అయితే ఈ పోస్ట్‌ను చూసిన వారిలో 69శాతం మంది “డీ” ఆప్షన్‌కు ఓటు వేయగా.. మిగిలిన 31 శాతం మంది “ఎల్” ఆప్షన్‌కు ఓటు వేశారు. దీనిని చూసిన సదరు బాలిక తాను బతకడానికి అనర్హురాలని నిర్ణయించుకుని.. బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు చేసుకుంది. ఈ ఘటనపై మలేసియా పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులతోపాటు.. ఆ బాలిక స్నేహితుల సామాజిక మాధ్యమాల ఖాతాలను కూడా పరిశీలిస్తున్నారు.