ఆఫ్రికా దేశం ఘనాలో ఘోర రోడ్డు ప్రమాదం

| Edited By:

Mar 23, 2019 | 7:26 AM

ఆఫ్రికా దేశమైన ఘనాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బస్సులు ఎదురెదురుగా వచ్చి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఏకంగా 60 మంది ప్రాణాలు కోల్పోయారు. అంపోమా పట్టణంలో ఈ ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీ కొన్న తర్వాత ఓ బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించగా.. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే ఈ […]

ఆఫ్రికా దేశం ఘనాలో ఘోర రోడ్డు ప్రమాదం
Follow us on

ఆఫ్రికా దేశమైన ఘనాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బస్సులు ఎదురెదురుగా వచ్చి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఏకంగా 60 మంది ప్రాణాలు కోల్పోయారు. అంపోమా పట్టణంలో ఈ ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీ కొన్న తర్వాత ఓ బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించగా.. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు పోలీసులు. ఓ బస్సుల మంటల్లో కాలిపోగా.. మరో బస్సు పెద్ద గుంతలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.