Watch: టర్కియేలో భూకంపం.. తెల్లవారుజామున 6.2 తీవ్రతతో అల్లకల్లోలం..!

ఇదిలా ఉంటే, టర్కీలోని మధ్యధరా తీరప్రాంతంలోని మార్మారిస్ పట్టణంలో రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపానికి భయపడి జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసే ప్రయత్నంలో ఏడుగురు గాయపడ్డారు. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉందని అధికారులు తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టంపై

Watch: టర్కియేలో భూకంపం.. తెల్లవారుజామున 6.2 తీవ్రతతో అల్లకల్లోలం..!
Earthquakes

Updated on: Jun 03, 2025 | 8:27 AM

టర్కీలో భూకంపం అలజడిని సృష్టించింది. టర్కీ సరిహద్దు ప్రాంతంలోని డోడెకానీస్ దీవుల సమీపంలో 6.2 తీవ్రతతో కూడిన శక్తివంతమైన భూకంపం సంభవించింది. అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారు. 23:17 UTCకి నమోదైన ఈ భూకంపం రోడ్స్ నుండి దాదాపు 18 కిలోమీటర్ల దూరంలో 68 కిలోమీటర్ల (42 మైళ్ళు) లోతులో సంభవించిందని EMSC తెలిపింది.
దక్షిణ గ్రీస్, పశ్చిమ టర్కీ సమీపంలోని ఏజియన్ సముద్ర తీర ప్రాంతాలలో ప్రకంపనలు సంభవించినట్లు సమాచారం. స్థానిక అధికారులు ప్రస్తుతం పరిస్థితిని అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉందని అధికారులు తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టంపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.. అనంతర ప్రకంపనలు సంభవించే అవకాశం ఉన్నందున సంబంధిత అన్ని విభాగాల రెస్క్యూ బృందాలు అప్రమత్తంగా ఉన్నాయి.

ఇదిలా ఉంటే, టర్కీలోని మధ్యధరా తీరప్రాంతంలోని మార్మారిస్ పట్టణంలో రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపానికి భయపడి జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసే ప్రయత్నంలో ఏడుగురు గాయపడ్డారు. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉందని అధికారులు తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టంపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

మధ్యధర సముద్రంలో కేంద్రీకృతమై ఉన్న భూకంపం తెల్లవారుజామున 2.17 గంటలకు సంభవించింది. గ్రీకు ద్వీపం రోడ్స్‌తో సహా సమీప ప్రాంతాలలో కూడా దీని ప్రభావం కనిపించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us