అమెజాన్ మంటలకు నేను బాధ్యుడినా ? డీకాప్రియో మండిపాటు

|

Dec 01, 2019 | 2:05 PM

అమెజాన్ కార్చిచ్చుకు తానే బాధ్యుడినంటూ బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సనారో చేసిన ఆరోపణలను హాలీవుడ్ స్టార్, పర్యావరణ ప్రేమికుడు కూడా అయిన లియోనార్డో డీకాప్రియో ఖండించాడు. అమెజాన్ లో మంటలు రేగడానికి కారణమవుతున్న ఎన్జీఓ సంస్థకు డీకాప్రియో 5 లక్షల డాలర్ల విరాళం అందించాడని బొల్సనారో ఆరోపించిన సంగతి తెలిసిందే. అమెజాన్ అడవులు దహనం కావడానికి మీరు ఆర్ధిక సాయం చేయలేదా అని ఆయన ప్రశ్నించాడు. అయితే ఈ ఆరోపణలకు ఆయన ఎలాంటి ఆధారాలూ చూపలేకపోయాడు. కాగా-తానేమీ […]

అమెజాన్ మంటలకు నేను బాధ్యుడినా ? డీకాప్రియో మండిపాటు
Follow us on

అమెజాన్ కార్చిచ్చుకు తానే బాధ్యుడినంటూ బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సనారో చేసిన ఆరోపణలను హాలీవుడ్ స్టార్, పర్యావరణ ప్రేమికుడు కూడా అయిన లియోనార్డో డీకాప్రియో ఖండించాడు. అమెజాన్ లో మంటలు రేగడానికి కారణమవుతున్న ఎన్జీఓ సంస్థకు డీకాప్రియో 5 లక్షల డాలర్ల విరాళం అందించాడని బొల్సనారో ఆరోపించిన సంగతి తెలిసిందే. అమెజాన్ అడవులు దహనం కావడానికి మీరు ఆర్ధిక సాయం చేయలేదా అని ఆయన ప్రశ్నించాడు. అయితే ఈ ఆరోపణలకు ఆయన ఎలాంటి ఆధారాలూ చూపలేకపోయాడు. కాగా-తానేమీ ప్రభుత్వేతర సంస్థకు ఎలాంటి ఆర్ధిక సాయమూ చేయలేదని డీకాప్రియో పేర్కొన్నాడు.

నిజానికి అమెజాన్ అడవుల పరిరక్షణకు కృషి చేస్తున్న బ్రెజిల్ వాసులకు మద్దతునిస్తున్నానని ఆయన తన తన ఇన్ స్టా గ్రామ్ లో వివరించాడు. పర్యావరణాన్ని కాపాడే అడవుల వంటివి క్రమేపీ ఇలాంటి ప్రమాదాల బారిన పడుతున్నాయని, వీటి నివారణకు కృషి చేసే బృందాలకు తాను అండగా ఉంటున్నందుకు ఎంతో గర్విస్తున్నానని ఈ నటుడు పేర్కొన్నాడు. అటు-బొల్సనారో ఆరోపణలను గ్లోబల్ వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్, ఐయుసిఎన్ స్పీసిస్ సర్వైవల్ కమిషన్ కూడా ఖండించాయి. పర్యావరణ పరిరక్షణకు నడుం కట్టిన ఈ సంస్థలు.. పేరు పెట్టి బ్రెజిల్ అధ్యక్షుడి గురించి ప్రస్తావించకపోయినప్పటికీ..పరోక్షంగా డీకాప్రియో వాదనలను సమర్థించాయి.