Blast In Factory: లాహోర్‌లో పేలిన బాయిలర్.. ఇద్దరు మృతి.. ఒకరికి గాయాలు

|

Oct 21, 2021 | 7:58 PM

పాకిస్తాన్ లాహోర్‌లోని ముల్తాన్ రోడ్డులో ఉన్న పరిశ్రమలో పేలుడు సంభవించింది. గురువారం ఒక పానీయాల కర్మాగారం బాయిలర్ పేలి ఇద్దరు వ్యక్తులు మరణించారు. బాయిలర్ పేలడంతో ఫ్యాక్టరీ భవనంలో మంటలు చెలరేగాయి...

Blast In Factory: లాహోర్‌లో పేలిన బాయిలర్.. ఇద్దరు మృతి.. ఒకరికి గాయాలు
Blast
Follow us on

పాకిస్తాన్ లాహోర్‌లోని ముల్తాన్ రోడ్డులో ఉన్న పరిశ్రమలో పేలుడు సంభవించింది. గురువారం ఒక పానీయాల కర్మాగారం బాయిలర్ పేలి ఇద్దరు వ్యక్తులు మరణించారు. బాయిలర్ పేలడంతో ఫ్యాక్టరీ భవనంలో మంటలు చెలరేగాయి. పేలుడు తీవ్రత కర్మాగారంతోపాటు సమీప భవనాలపై ప్రభావం చూపించింది. భవనం అద్దాలు కూడా పగిలిపోయాయి. సమాచారం అందుకున్న ఏడు అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. ఈ ప్రమాదంలో ఒక ప్రయాణికుడితోపాటు ఫ్యాక్టరీ ఉద్యోగి మృతి చెందారు. కర్మాగారంలోని సెక్యూరిటీ గార్డు కాలిన గాయాలయ్యాయి.

అతడిని ఆసుపత్రికి తరలించారు. ఇదే మరో ఫ్యాక్టరీ పైకప్పు కూలడంతో ముగ్గురు మరణించారు. ఫైసలాబాద్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలుడు ఫలితంగా అది కుప్పకూలింది. ఫైసలాబాద్ సమీపంలోని సమాన బ్రిడ్జ్ సమీపంలో ఉన్న ఫ్యాక్టరీలో ఈ ఘటన జరిగింది. ఈ సంఘటన తరువాత మరో 12 మంది కూలీలు కూడా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పాకిస్థాన్‌లో ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం డిసెంబర్ 22 న కరాచీలో కూడా ఒక బాయిలర్ పేలింది. ఇక్కడ ఐస్ ఫ్యాక్టరీ బాయిలర్‌పై పేలుడు సంభవించడంతో 8 మంది ప్రాణాలు కోల్పోగా, 15 మంది గాయపడ్డారు.

Read Also.. Indian Army: అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనాకు ధీటుగా.. భారత సైనిక మోహరింపు!