స్నాతకోత్సవంలో చించి పోగులు పెట్టింది.. షాక్ తిన్న వీసీ

|

Dec 25, 2019 | 3:34 PM

సవరించిన పౌరసత్వ చట్టంపై విద్యార్థిలోకం భగ్గుమంటోంది. కేవలం వీధుల్లోనే కాదు.. తాము డిగ్రీలు అందుకుంటున్న సమయంలోనూ వీళ్ళు తీవ్ర నిరసన తెలియజేస్తున్నారు. కోల్ కతా లోని జాదవ్ పూర్ యూనివర్సిటీ కాన్వొకేషన్ లో తన ఎంఏ డిగ్రీ అందుకున్న ఓ విద్యార్థిని చేసిన ‘ సాహసమే ‘ ఇందుకు నిదర్శనం. దేవస్మిత చౌదరి అనే ఈమె సాక్షాత్తూ వైస్-ఛాన్సలర్, ప్రొ-వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ల సమక్షంలోనే.. వేదికపై ఈ చట్టం తాలూకు ప్రతిని చించి పోగులు పెట్టింది. డిగ్రీని […]

స్నాతకోత్సవంలో చించి పోగులు పెట్టింది.. షాక్ తిన్న వీసీ
Follow us on

సవరించిన పౌరసత్వ చట్టంపై విద్యార్థిలోకం భగ్గుమంటోంది. కేవలం వీధుల్లోనే కాదు.. తాము డిగ్రీలు అందుకుంటున్న సమయంలోనూ వీళ్ళు తీవ్ర నిరసన తెలియజేస్తున్నారు. కోల్ కతా లోని జాదవ్ పూర్ యూనివర్సిటీ కాన్వొకేషన్ లో తన ఎంఏ డిగ్రీ అందుకున్న ఓ విద్యార్థిని చేసిన ‘ సాహసమే ‘ ఇందుకు నిదర్శనం. దేవస్మిత చౌదరి అనే ఈమె సాక్షాత్తూ వైస్-ఛాన్సలర్, ప్రొ-వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ల సమక్షంలోనే.. వేదికపై ఈ చట్టం తాలూకు ప్రతిని చించి పోగులు పెట్టింది. డిగ్రీని అందుకునే ముందు ఆమె.. తన ఐడీని చూపబోనంటూ.. ‘ ఇంక్విలాబ్ జిందాబాద్ ‘ అని కూడా కేక పెట్టింది. ఈ యూనివర్సిటీ పట్ల తనకెలాంటి అగౌరవం లేదని, ఎంఏ డిగ్రీని అందుకుంటున్నందుకు ఎంతో గర్వంగా ఉందని తెలిపింది. అయితే సీఏఏ కు వ్యతిరేకంగా నా నిరసనను తెలియజేసేందుకు ఈ వేదికను ఎంచుకున్నాను అని దేవస్మిత పేర్కొంది. ఆమె చర్యతో వీసీ తదితరులు షాక్ తిన్నారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న తన ఫ్రెండ్స్ లో కొంతమంది వీసీ నుంచి డిగ్రీని అందుకునేందుకు నిరాకరించారని దేవస్మిత వెల్లడించింది. మరో విద్యార్ధి కూడా ఆమెతో గళం కలిపాడు. కాగా-మంగళవారం జాదవ్ పూర్ యూనివర్సిటీలో ప్రవేశించేందుకు యత్నించిన బెంగాల్ గవర్నర్ జగ దీప్ ధన్ కర్ కి కూడా చేదు అనుభవం కలిగింది. ఆయనను లోపలికి వెళ్లనివ్వకుండా నిరసనకారులు, విద్యార్థులు అడ్డుకున్నారు.