నా భార్య జోలికే వస్తారా..! యుద్ధానికి సిద్ధం కండి

| Edited By:

Jul 02, 2020 | 1:17 PM

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనను కెలికారంటే దానికి కచ్చితంగా పర్యవసానం ఉంటుంది.

నా భార్య జోలికే వస్తారా..! యుద్ధానికి సిద్ధం కండి
Follow us on

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనను కెలికారంటే దానికి కచ్చితంగా పర్యవసానం ఉంటుంది. సొంతవాళ్లైనా సరే తనకు వ్యతిరేకంగా మాట్లాడితే వారికి చావే శరణ్యం. ఇక యుద్ధం అంటే ఎప్పుడైనా రెడీ అనే ధోరణిలో కిమ్ ఉంటారు. అందుకే అగ్రరాజ్యం అమెరికా సైతం ఉత్తరకొరియా అధ్యక్షుడితో రాజీని కుదుర్చుకుంది.

అయితే ఇటీవల కాలంలో ఉత్తరకొరియాపై దక్షిణ కొరియా కయ్యానికి సిద్దమైంది. సరిహద్దుల్లో బెలూన్లతో కిమ్‌కు వ్యతిరేకంగా దక్షిణ కొరియా కొన్ని కరపత్రాలను జారవిడిచింది. ఈ క్రమంలో కిమ్‌ సోదరి కిమ్‌ యో జోంగ్ దక్షిణ కొరియాకు గట్టి హెచ్చరికలే చేసింది. మీ తీరు మార్చుకోకోతే సైనిక చర్యలకు వెనుకాడమంటూ జోంగ్ ప్రకటించింది. అంతేకాదు సరిహద్దుల్లో దక్షిణ కొరియాకు చెందిన ఓ ఆఫీసును కూడా నార్త్‌ కొరియా పేల్చేసింది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఎక్కువవడంతో పాటు యుద్ధ వాతావరణం నెలకొంది. అయితే కొద్ది రోజుల తరువాత ఈ నిర్ణయంపై కిమ్‌ వెనక్కి తగ్గారు.

ఇదిలా ఉంటే ఆ సమయంలో కిమ్‌కు అంత కోపం రావడానికి మరో కారణం ఉందట. అదేంటంటే దక్షిణ కొరియా విడుదల చేసిన కరపత్రాల్లో కిమ్ జాంగ్‌ ఉన్ భార్య రి సోల్‌ జుకు చెందిన ఫొటోలు ఉన్నాయి. ఆమె ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి దక్షిణ కొరియా ఆ కరపత్రాలపై ముద్రించారట. ఈ సంఘటన కిమ్‌కి చాలా కోపం తెప్పించిందట. అందుకే దక్షిణ కొరియాపై కిమ్‌ యుద్ధానికి సిద్ధమయ్యారట. ఈ క్రమంలోనే సౌత్‌ కొరియాకు చెందిన ఆఫీస్‌ను పేల్చేసినట్లు ఉత్తరకొరియాలో ఉన్న రష్యన్‌ అంబాసిడర్‌ అలెగ్జాండర్‌ తెలిపారు. నిజంగా ఇది దుశ్చర్య అని, నార్త్ కొరియన్ అధ్యక్షుడికి ఇది చాలా కోపం తెప్పించిదని ఆయన అన్నారు. ఇరు దేశాల మధ్య ఎప్పటినుంచో ఇలా బెలూన్లతో కవ్వింపు చర్యలు కొనసాగుతుంటాయని.. కానీ తన భార్యను టార్గెట్ చేస్తూ దక్షిణ కొరియా పాల్పడ్డ చర్య కిమ్‌ను కోపాద్రిక్తుడిని చేసిందని అలెగ్జాండర్‌ అన్నారు. అయితే కారణాలు తెలీవు గానీ ఈ యుద్ధాన్ని విరమించుకున్నారు కిమ్‌.