‘మీటూ’ ఉద్యమం తరహాలో అక్కడ ‘కూటూ’ ఉద్యమం

| Edited By:

Mar 22, 2019 | 1:24 PM

టోక్యో : కొన్నాళ్ల కిందట ‘మీటూ’ ఉద్యమం  ఎంతటి ప్రకంపనలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ఇప్పుడు జపాన్ లో అదే తరహాలో సోషల్ మీడియా వేదికగా “కూటూ” ఉద్యమం పురుడుపోసుకుంది. ఆఫీసుల్లో పనిచేస్తున్న మహిళలు హైహీల్స్ ధరించడంతోపాటు డ్రెస్ కోడ్ నిబంధన విధించడంపై జపాన్ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసుల్లో పనిచేస్తున్నంత సేపు హైహీల్స్ ధరించడం కారణంగా కాళ్లలో రక్తప్రసరణ తగ్గడంతో పాటు నడిచే సమయంలో ప్రమాదాలు అయ్యే అవకాశం ఉందని జపనీస్ మహిళలు […]

మీటూ ఉద్యమం తరహాలో అక్కడ కూటూ ఉద్యమం
Follow us on

టోక్యో : కొన్నాళ్ల కిందట ‘మీటూ’ ఉద్యమం  ఎంతటి ప్రకంపనలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ఇప్పుడు జపాన్ లో అదే తరహాలో సోషల్ మీడియా వేదికగా “కూటూ” ఉద్యమం పురుడుపోసుకుంది. ఆఫీసుల్లో పనిచేస్తున్న మహిళలు హైహీల్స్ ధరించడంతోపాటు డ్రెస్ కోడ్ నిబంధన విధించడంపై జపాన్ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసుల్లో పనిచేస్తున్నంత సేపు హైహీల్స్ ధరించడం కారణంగా కాళ్లలో రక్తప్రసరణ తగ్గడంతో పాటు నడిచే సమయంలో ప్రమాదాలు అయ్యే అవకాశం ఉందని జపనీస్ మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ‘కూటూ’ పేరుతో ఆన్ లైన్ ఉద్యమానికి తెరలేపారు. పురుషులను, స్త్రీలను వేర్వేరుగా చూడడం ఎందుకని జపాన్ ఉద్యోగినులు ప్రశ్నిస్తున్నారు. జపనీస్ భాషలో ‘కూట్సు’ అంటూ బూట్లు అనే అర్థం వస్తుంది. అందులోంచి మొదటి అక్షరాన్ని తీసుకుని ‘కూటూ’ పేరుతో ఉద్యమం లేవనెత్తారు. మీటూ తరహాలో ‘కూటూ’ పేరిట ఉద్యమానికి జపాన్ మహిళలు తెరలేపారు.