
ప్రపంచంలోని చాలా దేశాలు ఇప్పుడు రక్షణ రంగంలో తమను తాము బలోపేతం చేసుకోవడంలో బిజీగా ఉన్నాయి. అదే బాటలో జపాన్ కూడా ఓ అడుగు ముందుంది. ప్రస్తుతం ఇజ్రాయెల్ – హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో జపాన్ ఓ అడుగు ముందుకేసింది. ఎలక్ట్రిక్ గన్ మెషీన్‌ను ప్రకటించింది.
దీన్ని దృష్టిలో ఉంచుకుని.. ఇతర పెద్ద దేశాలన్నీ కూడా తమ భద్రతా సంసిద్ధతను అంచనా వేసుకుని.. తమను తాము బలోపేతం చేసుకునేందుకు కృషి చేస్తున్నాయి. ఇంతలో.. జపాన్ తాము కొత్త తయారు చేసిన ఆయుధాలలో ఒకదాన్ని పరీక్షించింది. అదేంటి..? దాని విశేషాలు ఏంటో తెలిస్తే షాకవుతారు. అవేంటో మనం ఇక్కడ తెలుసుకుందాం..
జపాన్ విద్యుదయస్కాంత ట్రైన్గన్ను పరీక్షించింది. ప్రత్యేక విషయం ఏంటంటే ఈ పరీక్ష సముద్ర నౌక నుంచి జరిగింది. ఇప్పటి వరకు ఏ దేశం కూడా ఇలాంటి ఆయుధాన్ని సముద్ర తీరంలో మోహరించలేదు. ఇది అధునాతన ఆయుధం, జపాన్ నౌకాదళానికి ఇది గొప్ప బలం అని చెప్పవచ్చు.
కొత్త ఆయుధం రైల్‌గన్ ప్రాజెక్ట్ ప్రారంభంలో తయారు చేయాలనుకున్న ఆయుధ రకం కంటే అధునాతనమైనది. రక్షణ సంస్థ ALTA ప్రకారం, ఇది 2,230m/s వేగంతో లక్ష్యంపై దాడి చేస్తుంది. అయితే, దాని గురించి పెద్దగా సమాచారం ఇవ్వలేదు. రైల్‌గన్ తన లక్ష్యాన్ని ఏ వేగంతో నాశనం చేస్తుందో నిర్ణయించవచ్చు. అంటే దాడి చేస్తున్న వేగాన్ని తగ్గించుకోవచ్చు.. పెంచుకోవచ్చు.
ఇంతకుముందు.. అమెరికా కూడా విద్యుదయస్కాంత ట్రైన్గన్ని తయారు చేయడానికి ప్రయత్నించింది. అది విజయవంతం కాలేదు. కానీ జపాన్ దానిని విజయవంతంగా పరీక్షించింది. ఇప్పుడు సముద్రం కాకుండా.. భూమిపై కూడా ప్రయోగించేందుకు రెడీ అవుతోంది. జపాన్ తయారు చేసిన ఈ ఆయుధాన్ని చూసిన చైనా, రష్యా, ఉత్తర కొరియా వంటి దేశాలు భయాందోళనకు గురవుతున్నాయి. ఎందుకంటే వాటిలో ఎవరైనా జపాన్‌పై హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగిస్తే.. విద్యుదయస్కాంత ట్రైన్గన్ దానిని కూడా ఆపుతుంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి