ఇరాన్ సుప్రీం మొజ్తబా ఖమేనీ బీజింగ్‌కు తరలివెళ్లారా? రష్యా సీక్రెట్ ఫ్లైట్ టెహ్రాన్ ఎందుకు వచ్చింది..?

ఇరాన్ నాయకత్వానికి సంబంధించిన తాజా పరిణామాలు మరోసారి అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. రష్యా ప్రత్యేక భద్రతా విమానం Tu-214PU మాస్కో నుంచి టెహ్రాన్. అక్కడ నుంచి చైనా రాజధాని బీజింగ్‌కు వెళ్లింది. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ కూడా ఆ విమానంలో చైనాకు తరలివెళ్లారనే ఊహాగానాలు సోషల్ మీడియా, కొన్ని విదేశీ మీడియా వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయాన్ని ధృవీకరించే అధికారిక ఆధారాలు ఇప్పటివరకు వెలువడలేదు.

ఇరాన్ సుప్రీం మొజ్తబా ఖమేనీ బీజింగ్‌కు తరలివెళ్లారా? రష్యా సీక్రెట్ ఫ్లైట్ టెహ్రాన్ ఎందుకు వచ్చింది..?
Iran Supreme Leader Mojtaba Khamenei

Updated on: Jul 14, 2026 | 3:59 PM

ఇరాన్ నాయకత్వానికి సంబంధించిన తాజా పరిణామాలు మరోసారి అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. రష్యా ప్రత్యేక భద్రతా విమానం Tu-214PU మాస్కో నుంచి టెహ్రాన్. అక్కడ నుంచి చైనా రాజధాని బీజింగ్‌కు వెళ్లింది. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ కూడా ఆ విమానంలో చైనాకు తరలివెళ్లారనే ఊహాగానాలు సోషల్ మీడియా, కొన్ని విదేశీ మీడియా వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయాన్ని ధృవీకరించే అధికారిక ఆధారాలు ఇప్పటివరకు వెలువడలేదు.

సోమవారం (జూలై 13) రష్యా అధ్యక్షుడి ఆదేశాల మేరకు Tu-214PU విమానం మాస్కో నుంచి టెహ్రాన్‌కు చేరుకున్నట్లు విమాన ప్రయాణాల ట్రాకింగ్ వేదికలు సూచించాయి. అనంతరం అదే విమానం బీజింగ్‌కు ప్రయాణించింది. అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలు, అధిక భద్రతా ప్రమాణాలతో కూడిన ఈ విమానం సాధారణంగా కీలక ప్రభుత్వ, సైనిక అవసరాల కోసం వినియోగించబడుతుంది. అయితే, ఆ విమానంలో ఎవరు ప్రయాణించారనే వివరాలు అధికారికంగా వెల్లడించలేదు.

మొజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై గత కొన్ని నెలలుగా అనేక కథనాలు వెలువడుతున్నాయి. 2026 ఫిబ్రవరిలో అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారనే ప్రచారం జరిగినప్పటి నుంచి ఆయన బహిరంగంగా కనిపించలేదు. అనంతరం మార్చిలో కువైట్‌కు చెందిన అల్-జరీదా పత్రిక, చికిత్స కోసం ఆయనను మాస్కోకు తరలించినట్లు కథనం ప్రచురించింది. అయితే, ఈ సమాచారం కూడా స్వతంత్రంగా ధృవీకరించలేదు.

ఇటీవల అలీ ఖమేనీ అంత్యక్రియలకు మొజ్తబా హాజరు కాకపోవడం కూడా ఆయన ఆచూకీపై ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. ప్రస్తుతం రష్యాపై ఉక్రెయిన్ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో, భద్రతా కారణాల దృష్ట్యా మొజ్తబాను చైనాకు తరలించి ఉండవచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే, ఇరాన్ ప్రభుత్వం, రష్యా లేదా చైనా ఈ అంశంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అందువల్ల మొజ్తబా ఖమేనీ నిజంగానే బీజింగ్‌కు వెళ్లారనే వాదన ఇప్పటివరకు ధృవీకరించలేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రధానంగా ఊహాగానాలు, ధృవీకరించని మీడియా కథనాలపైనే ఆధారపడి ఉంది. కాబట్టి అధికారిక ప్రకటనలు వెలువడే వరకు ఈ వార్తలను నిర్దారించలేము.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us