Mojtaba Khamenei: ఆయన హత్యకు కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటా.. ఇరాన్ సుప్రీం లీడర్ సంచలన ప్రకటన!

తన తండ్రిని హత్య చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని.. నేను ఉన్నా లేకపోయినా.. కచ్చితంగా తన తండ్రి అయిన అలీ ఖమేనీ హత్యకు కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని.. ఇరాన్ ప్రస్తుత సుప్రీండ్ లీడర్ మోజ్తబా ఖమేనీ అధికారికంగా ప్రకటించారు. అమెరికా- ఇజ్రాయొల్ సంయుక్తంగా చేసిన దాడిలో మరణించిన అలీ ఖమేనీ అంత్యక్రియల సందర్‌భంగా మొజ్తబా ఖమేనీ ఈ ప్రకటన చేశారు.

Mojtaba Khamenei: ఆయన హత్యకు కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటా.. ఇరాన్ సుప్రీం లీడర్ సంచలన ప్రకటన!
Ali Khamenei Assassination

Updated on: Jul 11, 2026 | 9:46 PM

తన తండ్రి అంత్యక్రియల సందర్భంగా ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ కీలక ప్రకటన చేశారు. తన తండ్రి హత్యకు కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటనించారు. యావత్ ఇరాన్ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ ప్రతికారం అనేది తన వ్యక్తిగత ఉనికిపై లేదా ఇతర అధికారులపై ఆధారపడి ఉండదు. తాము ఉన్నా లేకపోయినా శత్రువులకు శిక్ష తప్పదు అని మోజ్తబా ఖమేనీ స్పష్టం చేశారు. ఇటీవల అలీ ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా ఇరాన్, ఇరాక్ అంతటా, ముఖ్యంగా టెహ్రాన్, కోమ్, నజాఫ్, కర్బలా, మషద్‌లలో కోట్ల సంఖ్యలో ప్రజలు తరలివచ్చి శత్రువులకు గట్టి హెచ్చరికలు పంపడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఫిబ్రవరి 28న టెహ్రాన్‌లోని అలీ ఖమేనీ కార్యాలయంపై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఆయన మరణించారు. ఆయన మరణించిన కొన్ని నెలల తర్వాత, గురువారం అర్ధరాత్రి మషద్‌లోని ఇమామ్ రెజా పవిత్ర మందిరంలో వేలాది మంది మద్దతుదారుల సమక్షంలో అంత్యక్రియలు ముగిశాయి. ఈ నేపథ్యంలోనే మోజ్తబా ఖమేనీ నుండి ఈ తీవ్ర హెచ్చరికలు వచ్చాయి.

అయితే మోజ్తబా ప్రకటనకు ఒక రోజు ముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. తనను హత్య చేయడానికి ఇరాన్ చాలా కాలంగా కుట్రలు పన్నుతోందని ఆయన పేర్కొన్నారు. న్యూయార్క్ పోస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. తాను చాలా కాలంగా ఇరాన్ హిట్ లిస్ట్‌లో నంబర్ 1 స్థానంలో ఉన్నానని.. ఒకవేళ తనకు ఏదైనా జరిగితే, ఇరాన్‌పై ఇంతకు ముందెన్నడూ చూడని స్థాయిలో బాంబుల దాడి చేయాలని తాను ఇప్పటికే తమ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చానని తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us