US-Israel-Iran War: నాటి ఆప్తమిత్రులే.. ఇప్పుడు బద్ధశత్రువులు.. యుద్ధభూమిలో ఒంటరైన ఇరాన్..!

దగా పడ్డ ఇరాన్..! 1950 నుంచి దాదాపు అరడజను సార్లకు పైగా దగా పడుతూనే ఉంది ఇరాన్. నాటి ఆప్తమిత్రులే ఇప్పుడు బద్ధ శత్రువులయ్యారు. చమురు మీద ఆకలే అగ్రరాజ్యాలను అరాచక శక్తులుగా మార్చాయా? కొన్ని దేశాల ఆధిపత్య పోరులో, వాణిజ్య చక్రంలో ఇరాన్ బందీగా మారిందా? 75 ఏళ్ల చరిత్రపుస్తకంలో ఇరాన్‌ పేజీలు ఏం చెబుతున్నాయి?

US-Israel-Iran War: నాటి ఆప్తమిత్రులే.. ఇప్పుడు బద్ధశత్రువులు.. యుద్ధభూమిలో ఒంటరైన ఇరాన్..!
Iran Is Strategically Alone In Potential War

Updated on: Mar 03, 2026 | 10:10 PM

ఇరాన్‌లో చాలా చెత్త ఉంది.. అంతా ఏరిపారేస్తామని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు స్టేట్‌మెంట్ ఇవ్వనైతే ఇచ్చాడు గానీ, ఆచరించడం ఎలాగో తెలీక బుర్ర గోక్కుంటున్నాడు. ఇజ్రాయెల్‌తో కలిసి చెవులు కొరుక్కుంటున్నారు. నిజానికి, ఇరాన్‌లో ఉన్న ఇస్లామిక్ పాలనను అంతం చేయాలి.. ఇదీ ట్రంప్ గీసుకున్న ఒరిజినల్ ప్లాన్..! ఇజ్రాయెల్ దశాబ్దాలుగా కంటున్న కల కూడా అదే. అందులో ఫస్ట్ చాప్టర్.. ఖమేనీని అంతం చేయడం.. అనుకున్నట్లుగానే చేసేశాడు.. కానీ, టెహ్రాన్‌ పాలకుల దగ్గర ట్రంప్ ప్లాన్ లీకైనట్టుంది. ఓ ఖమేనీ పోతే, ఇంకో ఖమేనీ అంటూ నాలుగైదు అంచెల లీడర్‌షిప్‌ను క్రియేట్ చేసి పెట్టుకుని, మేకపోతు గాంభీర్యంతో, దింపుడు కళ్లెం ఆశలతో గట్టిగా నిలబడింది ఇరాన్. అంతకుమించి, చరిత్ర పుస్తకాల్లో ఇరాన్‌ పేరిట ఉన్న కొన్ని ప్రత్యేకమైన పేజీలు.. చారిత్రక ఘట్టాలు.. ఆ దేశం ఎంతటి కొరకరాని కొయ్యన్నది తేటతెల్లం చేస్తున్నాయి. గగనతలం నుంచి ఏ దేశాన్నయినా బెదరగొట్టొచ్చు. సర్జికల్ స్ట్రయిక్స్‌తో లీడర్లను మట్టుబెట్టొచ్చు. లేదా లేపుకొచ్చెయ్యొచ్చు.. కానీ నేరుగా ప్రభుత్వాలను తొలగించడం, సామ్రాజ్యాలను కూలదొయ్యడం అంత ఈజీ కాదు. ఇటీవల వెనెజులాలో అదే జరిగింది. ప్రెసిడెంట్‌ నికొలస్‌ మదురోని బందీగా పట్టుకొచ్చినా, అక్కడ ప్రభుత్వంలో మాత్రం అతడి కుటుంబీకులే సెటిలయ్యారు. ట్రంప్ పేరాశలు వర్కవుట్...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి