20 అడుగుల ఎత్తు నుంచి చేసిన స్టంట్ ఫెయిల్, తీవ్ర గాయాలు

| Edited By:

Mar 23, 2019 | 7:45 AM

అమెరికాలోని ఫ్లోరిడాలో కొందరు గిన్నీస్ రికాడు కోసం ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఎలాంటి సేఫ్టీ లేకుండా 20 అడుగుల ఎత్తు నుంచి చేసిన ఫీట్ ఫెయిల్ అయింది. దీంతో ఒక్కసారిగా పై నుంచి ఐదుమంది కింద పడ్డారు. హ్యూమన్ పిరమిడ్ రూపంలో 8 మంది ప్రమాదకరమైన స్టంట్ చేశారు. 20 అడుగుల ఎత్తులో ఉన్న తాడుపై ఈ ఫీట్ చేశారు. ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పడంతో ఐదుగురు కిందపడగా ముగ్గురు మాత్రం తాడు పట్టుకుని సేఫ్ అయ్యారు. […]

20 అడుగుల ఎత్తు నుంచి చేసిన స్టంట్ ఫెయిల్, తీవ్ర గాయాలు
Follow us on

అమెరికాలోని ఫ్లోరిడాలో కొందరు గిన్నీస్ రికాడు కోసం ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఎలాంటి సేఫ్టీ లేకుండా 20 అడుగుల ఎత్తు నుంచి చేసిన ఫీట్ ఫెయిల్ అయింది. దీంతో ఒక్కసారిగా పై నుంచి ఐదుమంది కింద పడ్డారు. హ్యూమన్ పిరమిడ్ రూపంలో 8 మంది ప్రమాదకరమైన స్టంట్ చేశారు. 20 అడుగుల ఎత్తులో ఉన్న తాడుపై ఈ ఫీట్ చేశారు. ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పడంతో ఐదుగురు కిందపడగా ముగ్గురు మాత్రం తాడు పట్టుకుని సేఫ్ అయ్యారు.

20 అడుగుల ఎత్తు నుంచి పడడంతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కొందరికి ఎముకలు విరిగిపోయాయి. దీంతో వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.