స్టాంప్‌కెక్కిన రామాయణం..!

|

Apr 24, 2019 | 7:18 PM

ఇతిహాసాల్లో రామాయణానికి ఉన్న ప్రత్యేకతే వేరు. రాములవారి స్వయంవరం, వనవాసం, సీతాపహరణం, రావణుడితో యుద్ధం… ఇలా ఎన్నో అద్భుతమైన ఘట్టాలు రామాయణంలో పొందుపరిచి ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత పురాతన , ఎక్కువమందిని ప్రభావితం చేసిన గ్రంధంగా రామాయణం గుర్తింపు పొందింది. అలాంటి ఎంతో గొప్ప విశిష్టత కలిగిన ఈ రామాయణం థీమ్‌తో ఇండోనేషియా ప్రభుత్వం ప్రత్యేక స్టాంప్ విడుదల చేసింది. రామాయణంలో సీతను రావణుడి బారి నుంచి రక్షించేందుకు జటాయువు చేసిన పోరాటాన్ని ఇతివృత్తంగా చేసుకుని ఈ […]

స్టాంప్‌కెక్కిన రామాయణం..!
Follow us on

ఇతిహాసాల్లో రామాయణానికి ఉన్న ప్రత్యేకతే వేరు. రాములవారి స్వయంవరం, వనవాసం, సీతాపహరణం, రావణుడితో యుద్ధం… ఇలా ఎన్నో అద్భుతమైన ఘట్టాలు రామాయణంలో పొందుపరిచి ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత పురాతన , ఎక్కువమందిని ప్రభావితం చేసిన గ్రంధంగా రామాయణం గుర్తింపు పొందింది. అలాంటి ఎంతో గొప్ప విశిష్టత కలిగిన ఈ రామాయణం థీమ్‌తో ఇండోనేషియా ప్రభుత్వం ప్రత్యేక స్టాంప్ విడుదల చేసింది. రామాయణంలో సీతను రావణుడి బారి నుంచి రక్షించేందుకు జటాయువు చేసిన పోరాటాన్ని ఇతివృత్తంగా చేసుకుని ఈ స్టాంపును రూపొందించారు. భారత్ తో దౌత్య సంబంధాలకు  70 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఇండోనేషియా ప్రభుత్వం ఈ స్టాంప్‌ను విడుదల చేసింది.