ఇండోనేషియాలో అల్లర్లు… ఆరుగురు మృతి

| Edited By:

May 22, 2019 | 8:17 PM

ఇండోనేషియా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడగానే దేశ రాజధాని జకార్తాలో చెలరేగిన అల్లర్లలో ఆరుగురు మృతి చెందినట్లు, 200 మంది గాయపడినట్లు ఇండోనేషియా పోలీసు అధికారులు స్పష్టం చేశారు. ఏప్రిల్‌లో జరిగిన ఈ ఎన్నికల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. అయితే ఫలితాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మంగళవారం సాయంత్రం నుంచే దేశ రాజధానిలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు కొందరు ఇండోనేషియన్లు. చనిపోయిన ఆరుగురిలో ఇండోనేషియన్ నేషనల్ పోలీస్ ఛీఫ్ టిటో కర్ణవియన్ కూడా ఉన్నట్లు స్థానిక […]

ఇండోనేషియాలో అల్లర్లు... ఆరుగురు మృతి
Follow us on

ఇండోనేషియా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడగానే దేశ రాజధాని జకార్తాలో చెలరేగిన అల్లర్లలో ఆరుగురు మృతి చెందినట్లు, 200 మంది గాయపడినట్లు ఇండోనేషియా పోలీసు అధికారులు స్పష్టం చేశారు. ఏప్రిల్‌లో జరిగిన ఈ ఎన్నికల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. అయితే ఫలితాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మంగళవారం సాయంత్రం నుంచే దేశ రాజధానిలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు కొందరు ఇండోనేషియన్లు. చనిపోయిన ఆరుగురిలో ఇండోనేషియన్ నేషనల్ పోలీస్ ఛీఫ్ టిటో కర్ణవియన్ కూడా ఉన్నట్లు స్థానిక ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఫలితాల తర్వాత చెలరేగిన ఈ అల్లర్లలో సుమారు 60 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.