Twitter: మస్క్ తీరుతో ఉద్యోగుల్లో తీవ్ర అసహనం.. వెరైటీగా నిరసన.. వీడియో వైరల్..

|

Nov 18, 2022 | 1:48 PM

తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్య ట్విట్టర్ సంస్థ ఊగిసలాడుతోంది. వందలాది మంది ట్విటర్ ఉద్యోగులు ఈ కంపెనీని విడిచిపెట్టేందుకు రెడీ అవుతున్నారు. కొత్త యజమాని ఎలన్ మస్క్ నుంచి వచ్చిన...

Twitter: మస్క్ తీరుతో ఉద్యోగుల్లో తీవ్ర అసహనం.. వెరైటీగా నిరసన.. వీడియో వైరల్..
Elon Musk, Twitter
Follow us on

తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్య ట్విట్టర్ సంస్థ ఊగిసలాడుతోంది. వందలాది మంది ట్విటర్ ఉద్యోగులు ఈ కంపెనీని విడిచిపెట్టేందుకు రెడీ అవుతున్నారు. కొత్త యజమాని ఎలన్ మస్క్ నుంచి వచ్చిన అల్టిమేటం ఉద్యోగులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో సిబ్బంది నిరసన తెలుపుతున్నారు. ఈ పరిస్థితుల మధ్య ఓ వ్యక్తి.. మస్క్‌ను అత్యంత ఆసక్తికరంగా ఎగతాళి చేశాడు. వైరల్ అవుతున్న వీడియో ట్విట్టర్ ప్రధాన కార్యాలయంలో కొన్ని సందేశాలను ప్రొజెక్ట్ చేస్తున్నట్లు చూపిస్తోంది. శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్ భవనం వైపు మస్క్ వ్యతిరేక సందేశాలను పంపించడాన్ని చూడవచ్చు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అప్‌లోడ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 6 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

ట్విట్టర్ కొనుగోలు చేశాక తరచూ వార్తల్లో నిలుస్తున్న టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ మరోసారి సంచలనమయ్యారు. ఈసారి విమర్శల స్థానంలో మస్క్ పై నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు. గతంలో కాస్త లావుగా ఉన్న మస్క్ ఇటీవల స్లిమ్ గా, ఫిట్ గా మారిపోయారు. ఇదే విషయాన్ని గుర్తుచేస్తూ ఓ ట్విట్టర్ యూజర్ ‘ఇప్పుడే చాలా ఫిట్ గా కన్పిస్తున్నారు’ అని ట్వీట్ చేశారు. జవాబుగా 13 కిలోల బరువు తగ్గానని మస్క్ ట్వీట్ చేశారు. బరువు ఎలా తగ్గారని మరో యూజర్ ప్రశ్నించగా.. ఓ స్నేహితుడి సలహాతో బరువు తగ్గించుకునే ప్రయత్నం చేశానన్నారు.

ఇవి కూడా చదవండి

ఆహారాన్ని మితంగా తీసుకోవడంతో పాటు తనకు చాలా ఇష్టమైన ఆహార పదార్థాల జోలికి వెళ్లలేదని మస్క్ చెప్పుకొచ్చారు. వీటితో పాటు క్రమం తప్పకుండా మందులు తీసుకున్నానని ఎలాన్ మస్క్ చెప్పారు. బరువు తగ్గాక మరింత చురుకుగా, మరింత ఆరోగ్యంగా ఉంటున్నానని మస్క్ ట్వీట్ చేశారు. కాగా, మస్క్ బరువు తగ్గడంపై ట్విట్టర్ యూజర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..