అంబులెన్స్ కోసం.. రెండుగా చీలిన జనసంద్రం

| Edited By: Srinu

Jun 20, 2019 | 4:49 PM

హాంకాంగ్‌లోని నిందితులను చైనాకు అప్పగించేందుకు ఉద్దేశించిన ముసాయిదా చట్టంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. దీంతో గత కొన్ని రోజులుగా అక్కడ ఆందోళనలు కొనసాగుతున్నాయి. అసమ్మతి వాదులను చైనాకు అప్పగించే వివాదాస్పద బిల్లును ఉపసంహరించుకుంటున్నామని, ఈ ఏడాదికి ఇక ఈ బిల్లు లేనట్లేనని హాంకాంగ్‌ సీఈవో క్యారీ లామ్‌ శనివారం రాత్రే ప్రకటించినప్పటికీ.. ఆందోళనలు మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలో ఆదివారం నాడు లక్షలాదిమంది వీధుల్లోకి వచ్చి తమ నిరసనను వ్యక్తపరిచారు. ఆ సమయంలోనే […]

అంబులెన్స్ కోసం.. రెండుగా చీలిన జనసంద్రం
Follow us on

హాంకాంగ్‌లోని నిందితులను చైనాకు అప్పగించేందుకు ఉద్దేశించిన ముసాయిదా చట్టంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. దీంతో గత కొన్ని రోజులుగా అక్కడ ఆందోళనలు కొనసాగుతున్నాయి. అసమ్మతి వాదులను చైనాకు అప్పగించే వివాదాస్పద బిల్లును ఉపసంహరించుకుంటున్నామని, ఈ ఏడాదికి ఇక ఈ బిల్లు లేనట్లేనని హాంకాంగ్‌ సీఈవో క్యారీ లామ్‌ శనివారం రాత్రే ప్రకటించినప్పటికీ.. ఆందోళనలు మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలో ఆదివారం నాడు లక్షలాదిమంది వీధుల్లోకి వచ్చి తమ నిరసనను వ్యక్తపరిచారు. ఆ సమయంలోనే అక్కడ జరిగిందో అద్భుతం. రోగితో కూడిన ఓ అంబులెన్స్ అటుగా రాగా.. 20లక్షల మంది ఆందోళకారులు దానికి రెండుగా చీలిపోయి దారి ఇచ్చారు. మానవత్వంతో స్పందించిన లక్షలాది ప్రజలు ఇలా పాయలుగా చీలిన సముద్రంలా అంబులెన్స్‌కు దారి ఇవ్వడం విశేషం. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.