త్వరలో మీకూ తెలుస్తుంది.. కిమ్‌ ఆరోగ్యంపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

| Edited By:

Apr 28, 2020 | 2:50 PM

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్యంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కిమ్ ఆరోగ్య పరిస్థితిపై తనకు స్పష్టమైన సమాచారం ఉందని..

త్వరలో మీకూ తెలుస్తుంది.. కిమ్‌ ఆరోగ్యంపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
Follow us on

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్యంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కిమ్ ఆరోగ్య పరిస్థితిపై తనకు స్పష్టమైన సమాచారం ఉందని.. అయితే ఈ విషయంపై మాట్లాడలేనని చెప్పారు. కిమ్ బావుండాలని మాత్రమే కోరుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.

సోమవారం రాత్రి విలేకర్ల సమావేశంలో మాట్లాడిన ట్రంప్.. కిమ్‌తో నాకు బలమైన సంబంధాలు ఉన్నాయి. కిమ్‌ ఆరోగ్యంగా ఉన్నాడని అనుకుంటా. ఆయన పరిస్థితి ఎలా ఉందో నాకు తెలుసు. కానీ చెప్పలేను. త్వరలోనే మీకూ ఈ విషయాలన్నీ తెలుస్తాయి అని చెప్పారు. అంతేకాదు తాను దేశాధ్యక్షుడు కాకపోయి ఉంటే.. ఈ పాటికి ఆ దేశంతో యుద్ధం చేయాల్సి వచ్చేది అంటూ ట్రంప్ కామెంట్లు చేశారు.

కాగా ఏప్రిల్15న కిమ్‌ తాత, ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సంగ్ 108వ జయంతి కార్యక్రమానికి ఆయన హాజరుకాలేదు. దీంతో ఆయన అస్వస్థతకు గురైనట్లు వార్తలు వినిపించాయి. అంతేకాదు కిమ్ ఆరోగ్యం క్షీణించిందని, కిమ్ కోసం చైనా నుంచి ఓ ప్రత్యేక బృందం ఉత్తర కొరియాకు వెళ్లిందని.. ఇలా పలు పుకార్లు వినిపించాయి. అయితే ఆ వార్తలన్నీ నార్త్‌ కొరియా ఖండించింది. వర్కర్స్‌కు కిమ్‌ శుభాకాంక్షలు తెలిపినట్లు ఉత్తర కొరియా మీడియా అధికారింగా తెలిపిన విషయం తెలిసిందే.

Read This Story Also: మహేష్‌తో మూవీ విషయంలో ఏం జరిగింది.. వంశీ పైడిపల్లి ఏం చెప్పారంటే..!