రష్యాను ముంచెత్తుతున్న వర్షాలు..

| Edited By: Srinu

Jul 01, 2019 | 7:44 PM

రష్యాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోత వర్షాలకు వరద పోటెత్తుతోంది. రికార్డు స్థాయిలో భారీ వర్షాలు కురవడంతో దేశవ్యాప్తంగా కాలువలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద ప్రవాహంలో చాలాచోట్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. ఇళ్లు సైతం నీట మునిగిపోగా.. అనేక రోడ్లు, బ్రిడ్జ్‌లు కుంగిపోయాయి. గ్రామాలతో పాటు పలు నగరాల్లోనూ వరద పోటెత్తుతోంది. ఇళ్లన్నీ పూర్తిగా వరదనీటిలో మునిగిపోవడంతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. మరోవైపు రంగంలోకి దిగిన రెస్క్యూ టీం.. వరదలో చిక్కుకున్న వారిని రక్షిస్తున్నారు. రష్యాలో […]

రష్యాను ముంచెత్తుతున్న వర్షాలు..
Follow us on

రష్యాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోత వర్షాలకు వరద పోటెత్తుతోంది. రికార్డు స్థాయిలో భారీ వర్షాలు కురవడంతో దేశవ్యాప్తంగా కాలువలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద ప్రవాహంలో చాలాచోట్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. ఇళ్లు సైతం నీట మునిగిపోగా.. అనేక రోడ్లు, బ్రిడ్జ్‌లు కుంగిపోయాయి.

గ్రామాలతో పాటు పలు నగరాల్లోనూ వరద పోటెత్తుతోంది. ఇళ్లన్నీ పూర్తిగా వరదనీటిలో మునిగిపోవడంతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. మరోవైపు రంగంలోకి దిగిన రెస్క్యూ టీం.. వరదలో చిక్కుకున్న వారిని రక్షిస్తున్నారు.

రష్యాలో ఏకధాటి వర్షాల కారణంగా ఇప్పటికే పలువురు మృత్యువాతపడ్డారు. అనేక మంది గల్లంతయ్యారు. బాధితులకు తాత్కాలికంగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో… రష్యా ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.