ఈఫిల్‌ టవర్‌కు 130 ఏళ్లు

|

May 16, 2019 | 6:11 PM

ప్యారిస్‌: ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన ఈఫిల్‌ టవర్‌ను నిర్మించి బుధవారంతో 130 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా టవర్‌ను రంగు రంగుల లేజర్‌ లైట్లతో అలంకరించారు. 130 ఏళ్ల ఈఫిల్‌ టవర్‌ చరిత్ర ప్రతిబింబించేలా ఈ లైట్లను అమర్చి, వాటికి ఎఫెక్ట్‌లను జోడించారు. లోకల్ టైమింగ్స్  ప్రకారం బుధవారం రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకూ ఈ ప్రదర్శన నిర్వహించినట్లు సమాచారం. ఈ సమయంలో ఈఫిల్‌ టవర్‌ మొత్తం మిరుమిట్లు గొలిపే రంగురంగుల విద్యుద్దీపాల […]

ఈఫిల్‌ టవర్‌కు 130 ఏళ్లు
Follow us on

ప్యారిస్‌: ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన ఈఫిల్‌ టవర్‌ను నిర్మించి బుధవారంతో 130 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా టవర్‌ను రంగు రంగుల లేజర్‌ లైట్లతో అలంకరించారు. 130 ఏళ్ల ఈఫిల్‌ టవర్‌ చరిత్ర ప్రతిబింబించేలా ఈ లైట్లను అమర్చి, వాటికి ఎఫెక్ట్‌లను జోడించారు. లోకల్ టైమింగ్స్  ప్రకారం బుధవారం రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకూ ఈ ప్రదర్శన నిర్వహించినట్లు సమాచారం. ఈ సమయంలో ఈఫిల్‌ టవర్‌ మొత్తం మిరుమిట్లు గొలిపే రంగురంగుల విద్యుద్దీపాల మధ్య  దేదీప్యమానంగా వెలిగిపోయింది.

ఈఫిల్‌ టవర్‌ను 1889లో నిర్మించారు. దీని ఎత్తు 324 మీటర్లు కాగా, నిర్మాణానికి 7,300 టన్నుల ఉక్కు వాడారు. ఈ టవర్‌ను నిర్మించి 130 ఏళ్లయినా ఇంకా దేశ విదేశాల నుంచి దీనికి పర్యటకుల తాకిడి ఏమాత్రం తగ్గలేదు. ఏటా ఈ టవర్‌ను సగటున ఏడు మిలియన్ల మంది సందర్శిస్తుంటారు.