Gold Mine Explosion in China: చైనా బంగారు గని లో భారీ పేలుడు.. చిక్కుకున్న 22 మంది కార్మికులు… సహక చర్యలకు ఆటంకం

|

Jan 12, 2021 | 10:47 AM

చైనాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బంగారు గనిలో పేలుడు సంభవించింది. తూర్పు షాండోంగ్ ప్రావిన్స్‌లో ఉన్న జిచెంగ్ టౌన్‌షిప్‌లో ఈ దారుణ ఘటన జరిగింది. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో..

Gold Mine Explosion in China: చైనా బంగారు గని లో భారీ పేలుడు..  చిక్కుకున్న 22 మంది కార్మికులు... సహక చర్యలకు ఆటంకం
Follow us on

Gold Mine Explosion in China: చైనాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బంగారు గనిలో పేలుడు సంభవించింది. తూర్పు షాండోంగ్ ప్రావిన్స్‌లో ఉన్న జిచెంగ్ టౌన్‌షిప్‌లో ఈ దారుణ ఘటన జరిగింది. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో 22 మంది కార్మికులు భూగర్భంలో చిక్కుకున్నారు. వెంటనే స్పందించిన అధికారులు రెస్కూ టీమ్ ను రంగంలోకి దింపింది. సహాయక చర్యలను చేపట్టింది అయితే పేలుడు కమ్యూనికేషన్ సిగ్నల్ వ్యవస్థను దెబ్బతీయడంతో… రెస్క్యూ టీమ్ గనిలో చిక్కుకున్న కార్మికులతో మాట్లాడడం సాధ్యం కాలేదని అధికారులు తెలిపారు. ఈ గని కి షాన్డాంగ్ వుకైలాంగ్ ఇన్వెస్ట్‌మెంట్ కో లిమిటెడ్ కు చెందింది. .. ఈ సంస్థ చైనాలో బంగారు గనులు కలిగిన నాల్గవ అతిపెద్ద సంస్థ.

Also Read: కరోనా పాజిటివ్ తో థాయ్‌లాండ్‌ ఓపెన్‌ నుంచి భారత్ స్టార్ షట్లర్ ఔట్