Nepal Floods: నేపాల్ లో భారీ వర్షాలు వరదల బీభత్సం.. 20 మంది గల్లంతు.. వారిలో ముగ్గురు భారతీయులు

|

Jun 17, 2021 | 1:12 PM

Nepal Floods: సెంట్రల్ నేపాల్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మరో వైపు పెద్ద ఎత్తున కురుస్తున్న వానలతో వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. సింధుపల్చోక్ జిల్లాలో...

Nepal Floods: నేపాల్ లో భారీ వర్షాలు వరదల బీభత్సం.. 20 మంది గల్లంతు.. వారిలో ముగ్గురు భారతీయులు
Nepal Floods
Follow us on

Nepal Floods: సెంట్రల్ నేపాల్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మరో వైపు పెద్ద ఎత్తున కురుస్తున్న వానలతో వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. సింధుపల్చోక్ జిల్లాలో అకస్మాత్తుగా వచ్చిన వరదల్లో అనేక గ్రామాలు చిక్కుకున్నాయి. వరద ఉధృతికి 20 మంది అదృశ్యమయ్యారు. వీరిలో ఆరుగురు విదేశీయులున్నారని అక్కడ ప్రభుత్వ అధికారులు చెప్పారు. మెలమ్చి నది పరీవాహక ప్రాంతం నుంచి దాదాపు 200 కుటుంబాలను సురక్షితంగా ఓ పాఠశాలకు తరలించినట్లు తెలిపారు.   ఇళ్ళు వరదల వల్ల తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. సహాయక చర్యల కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.

ఇదే అంశంపై సింధుపల్చోక్ జిల్లా పరిపాలనాధికారి అరుణ్ పొఖ్రెల్ స్పందించారు. మంగళవారం సాయంత్రం అకస్మాత్తుగా సంభవించిన వరదల్లో ముగ్గురు భారతీయులు, ముగ్గురు చైనీయులు అదృశ్యమైనట్లు తెలిపారు. మంచుకొండ కరిగిపోవడం వల్ల ఈ వరదలు వచ్చినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Also Read: మనసు ప్రశాంతంగా ఉండడం కోసం ఈ యోగాసనాన్ని ట్రై చేయండి..