వరదలతో నేపాల్‌ అతలాకుతలం… 67 మంది మృతి

| Edited By:

Jul 15, 2019 | 10:08 PM

భారీ వర్షాలు, వరదలతో హిమాలయ దేశం నేపాల్‌ అతలాకుతలమవుతోంది. వరదల కారణంగా ఇప్పటికే 67 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 32మంది గల్లంతయ్యారు. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. రాజధాని కాఠ్‌మాండూ సహా పలు ప్రాంతాల్లో గురువారం నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టిన అధికారులు ప్రజలను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొండచరియలు విరిగిపడడంతో నేపాల్‌లోని దాదాపు అన్ని ప్రధాన రహదారులపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. […]

వరదలతో నేపాల్‌ అతలాకుతలం... 67 మంది మృతి
Follow us on

భారీ వర్షాలు, వరదలతో హిమాలయ దేశం నేపాల్‌ అతలాకుతలమవుతోంది. వరదల కారణంగా ఇప్పటికే 67 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 32మంది గల్లంతయ్యారు. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. రాజధాని కాఠ్‌మాండూ సహా పలు ప్రాంతాల్లో గురువారం నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టిన అధికారులు ప్రజలను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొండచరియలు విరిగిపడడంతో నేపాల్‌లోని దాదాపు అన్ని ప్రధాన రహదారులపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

మరోవైపు నేపాల్ సరిహద్దు రాష్ట్రమైన బీహార్ తో సహా యూపీ,అసోంలో కూడా వరదలు ముంచెత్తుతున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు వరదబాధితులకు సహాయక చర్యలు చేపట్టారు. ముంపు ప్రాంతాల్లోని వారిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పడవల సహకారంతో జనాలను తరలిస్తున్నారు.