అమెరికాలో ఏంట్రా ఇది..! పాడుపని చేస్తూ అడ్డంగా బుక్కయిన తెలుగు యువకులు

పడమటి సంధ్యారాగం రోజుకో అపస్వరం పలుకుతోంది. అమెరికా దేశంలో మనోళ్లు చేసే కలల సాగులో విచ్చలవిడిగా కలుపుమొక్కలు పెరుగుతున్నాయి. ఒకరిద్దరో.. నలుగురైదుగురో.. ఏదోమూల రకరకాల కక్కుర్తులతో పాల్పడే కొన్ని అపసవ్య చర్యలు.. టోటల్ అమెరికన్-తెలుగు సమాజాన్ని కించపరిచే దిశగా సాగుతున్నాయి. లేటెస్ట్‌గా అమెరికాలో వెలుగుచూసిన వ్యభిచారకూపం అనే ఓ దిక్కుమాలిన బాగోతం.. అందులో కనిపించిన మనోళ్ల ఆనవాళ్లు.. మనల్ని మళ్లీమళ్లీ తలదించుకునేలా చేస్తోంది.

అమెరికాలో ఏంట్రా ఇది..! పాడుపని చేస్తూ అడ్డంగా బుక్కయిన తెలుగు యువకులు
USA Prostitution Case
Follow us

|

Updated on: Aug 22, 2024 | 8:51 PM

అమెరికాలో నేరాలు-ఘోరాలు ఘట్టాలకు సంబంధించి మనోళ్ల ఫోటోలకు ఫ్రేములు కట్టడం ఇవాళా రేపూ చాలా కామనైపోయింది. ఇటీవలే హెచ్‌1బీ వీసా రిగ్గింగ్‌ ద్వారా, దాదాపు 850 కోట్ల దందాకు పాల్పడి అరెస్టయిన ముఠా బాగోతం బైటపడితే వాటీజ్ దిస్ నాన్సెన్స్ అనుకున్నాం. ఆమెరికాలో 4 రాష్ట్రాల్లో విచ్చలవిడిగా జరిగిన వీసా లాటరీ కోటరీలో మన తెలుగోళ్లు ఇంకా ఎంతమంది? అని లెక్క గట్టుకున్నాం. అంతకుముందు.. వైజాగ్‌ నుంచి మనోళ్లను మనోళ్లే ఎక్స్‌పోర్ట్ చేసుకుని ఇరుకుగదుల్లో కుక్కి.. వెట్టిచాకిరీ చేయించుకుని, మానవ అక్రమరవాణా కేసుల్లో ఇరుక్కుంటే.. ఇదెక్కడి గొడవరా బాబూ అని తలలు బాదుకున్నాం. ఇప్పుడు అదే అమెరికాలో అంతకుమించిన దిక్కుమాలిన యవ్వారం ఇంకోటి వెలుగుచూసింది.

బండి నిఖిల్‌, గల్లా మోనిష్‌, కుమ్మరి నిఖిల్‌, మేకల జైకిరణ్‌రెడ్డి, రాయపాటి కార్తీక్‌.. ఈ ఐదుగురూ అమెరికా పోలీసులకు చిక్కిన తాజా తెలుగు జాతి రత్నాలు. టెక్సస్‌లోని డెంటన్‌ కౌంటీలో పోలీసులు చేపట్టిన ఆపరేషన్‌లో పట్టుబడిన ఏడుగురు భారతీయుల జాబితాలో వీళ్లూ ఉన్నారు. వీళ్లు చేసిన నేరం పేరేంటంటే.. సొలిసిటేషన్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్. వ్యభిచారం చేయాల్సిందిగా అవతలి అమ్మాయిల్ని ప్రోత్సహించడం. నిఖార్సుగా చెప్పాలంటే వ్యభిచార కూపంలోకి దించడం అన్నమాట.

మొత్తం 14 మంది అరెస్టయితే.. అందులో ఏడుగురు ఇండియన్స్‌. ఐదుగురు తెలుగువాళ్లు.. మిగతా ఇద్దరూ కుమార్‌ అమిత్‌, శ్రేష్ట నబిన్‌ అనే తెలుగేతరులు. ఈ ఐదుగురు తెలుగువారిలో గల్లా మోనిష్‌, మేకల జైకిరణ్‌రెడ్డిపై జువైనల్‌ యాక్ట్‌ కింద తీవ్ర అభియోగాలు నమోదయ్యాయి. 18ఏళ్ల కంటే తక్కువ వయసున్న అమ్మాయిలతో వ్యభిచారానికి ప్రయత్నించారట. అమెరికా చట్టాల ప్రకారం వీళ్లిద్దరికీ ఐదేళ్లదాకా జైలుశిక్ష పడే అవకాశం ఉంది. మిగతా ముగ్గురు తెలుగువాళ్లలో బండి నిఖిల్‌, కుమ్మరి నిఖిల్‌, రాయపాటి కార్తీక్‌లకు ఏడాది జైలు, 4వేల డాలర్ల జరిమానా పడొచ్చని చెబుతున్నారు. వ్యభిచార నిర్మూలనలో భాగంగా ఈనెల 14, 15 తేదీల్లో స్పెషల్ ఆపరేషన్‌ చేపట్టిన డెంటన్‌ కౌంటీ పోలీసులు.. ఈ రాకెట్‌ను ఛేదించారు. వ్యభిచారం రాకెట్‌లో ఇతరుల పాత్రపై కూడా అమెరికా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అమెరికాను అగ్రరాజ్యంగా నిలబెట్టి.. ఆ దేశాన్ని నడిపించే ప్రధాన ఇంధనం మనమేనని.. ఇటీవలే లెక్కలేసి చెప్పుకున్నాం. అమెరికా జనాభాలో 1.5 శాతం ఉన్న 51 లక్షల మంది ప్రవాస భారతీయులు.. ఆ దేశానికి అందిస్తున్న సేవలు భేష్ అంటూ ఇండియాస్పోరా నివేదిక చాటిచెప్పింది. అమెరికాలో 72 స్టార్టప్స్‌లో 55 వేల మంది పనిచేస్తున్నారు. అమెరికాలో 60 శాతం హోటళ్లు మనోళ్లవే.. 50 శాతం సూపర్‌మార్కెట్లు మనోళ్లు నిర్వహిస్తున్నవే. ఏటా 25 లక్షల కోట్ల రూపాయలకు పైగా పన్నులు కడుతూ అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఊతంగా నిలబడ్డది మనోళ్లే. ప్రతీ సంవత్సరం అమెరికాలో దాతృత్వ కార్యక్రమాలకు 2 బిలియన్ డాలర్లు విరాళమిస్తూ.. మనోళ్లు మంచి మనసు చాటుకుంటున్నారు. కానీ.. ఇదంతా ఒక పార్శ్వం మాత్రమే. ఇదే నాణేనికి మరోవైపు అలముకున్న నేరచరిత.

పైసా కోసం వీసాల కుంభకోణానికి పాల్పడ్డం, డబ్బా కంపెనీలు పెట్టి.. మనోళ్లతో మనోళ్లే వెట్టిచాకిరీ చేయించుకోవడం లాంటి నికృష్టాలతో సరిపెట్టుకోకుండా.. బ్రోతల్ ఉచ్చులోకి మైనరమ్మాయిల్ని దించడం లాంటి చర్యలకు దిగడం… పరాకాష్ట.

అమెరికన్ సెక్స్ రాకెట్‌లో ఇండియాకు చెందిన ఒక సినిమా కథానాయకి దొరికిందని ఆరేళ్ల కిందట ఒక బ్రేకింగ్‌న్యూస్ వినిపించింది. మరో నలుగురైదుగురు వర్థమాన హీరోయిన్లు కూడా ఇందులో ఉన్నట్టు చెప్పుకున్నారు. కల్చరల్ కవర్ పేరుతో అక్కడ నిర్వహించే వ్యభిచార కూపం గురించి పదేపదే వార్తలొచ్చేవి. కిషన్ మోదుగుమూడి అనే తెలుగు వ్యక్తి నేతృత్వంలో నడిచిన చికాగోలో బ్లూ రాకెట్‌ని అక్కడి పోలీసులు ఛేదించారు. ఆ మరక నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటుండగా.. ఇప్పుడు ఐదుగురు తెలుగు యువకులు.. సెక్స్ రాకెట్‌ కేసుల్లో చిక్కుకోవడం కలవరపరుస్తోంది.

ఉన్నత చదువులు.. అంతకంటే ఉన్నతమైన కొలువులే లక్ష్యంగా అమెరికాకు నిచ్చెనలేస్తున్న అనేకమంది తెలుగువారిపై ఇటువంటి ఉదంతాలు ప్రభావితం చూపకుండా ఉంటే అదే పదివేలు.

వాగులో చేపల కోసం వల వేసిన జాలరి.. చివర్లో ఊహించని ట్విస్ట్
వాగులో చేపల కోసం వల వేసిన జాలరి.. చివర్లో ఊహించని ట్విస్ట్
వెండితెర శిఖరంలా మెగాస్టార్.! హీరో అవ్వకముందు చిరు ఏం చేసేవారంటే?
వెండితెర శిఖరంలా మెగాస్టార్.! హీరో అవ్వకముందు చిరు ఏం చేసేవారంటే?
అబ్బవరం ఇంట మొదలైన పెళ్లి సందడి.! వీడియో షేర్ చేసిన హీరోయిన్.
అబ్బవరం ఇంట మొదలైన పెళ్లి సందడి.! వీడియో షేర్ చేసిన హీరోయిన్.
పద్దతిపాడు లేని మనిషి.! బాలీవుడ్ స్టార్‌పై అజయ్‌ భూపతి సీరియస్.
పద్దతిపాడు లేని మనిషి.! బాలీవుడ్ స్టార్‌పై అజయ్‌ భూపతి సీరియస్.
ఇంద్ర సెట్లో చరణ్..! ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన సోనాలి..
ఇంద్ర సెట్లో చరణ్..! ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన సోనాలి..
ఎట్టకేలకు OTTలోకి వచ్చిన సమంత, రానా సూపర్ హిట్ మూవీ.!
ఎట్టకేలకు OTTలోకి వచ్చిన సమంత, రానా సూపర్ హిట్ మూవీ.!
పైకి చూస్తే వట్టి పూతరేకుల పార్శిళ్లే.. తీరా తెరిచి చూడగా
పైకి చూస్తే వట్టి పూతరేకుల పార్శిళ్లే.. తీరా తెరిచి చూడగా
పెళ్లైన 2 నెలలకే.. బిగ్ ట్విస్ట్‌ ఇచ్చిన సోనాక్షి.! హాట్ టాపిక్..
పెళ్లైన 2 నెలలకే.. బిగ్ ట్విస్ట్‌ ఇచ్చిన సోనాక్షి.! హాట్ టాపిక్..
డైరెక్ట్‌ గా ఓటీటీలోకి కీర్తి సురేశ్ కాంట్రవర్సీ మూవీ. ఎందుకలా.?
డైరెక్ట్‌ గా ఓటీటీలోకి కీర్తి సురేశ్ కాంట్రవర్సీ మూవీ. ఎందుకలా.?
ఎలాంటి టెస్టులకైనా సిద్ధం అంటున్న హేమ. కానీ నెటిజన్స్ రిప్లై వేరే
ఎలాంటి టెస్టులకైనా సిద్ధం అంటున్న హేమ. కానీ నెటిజన్స్ రిప్లై వేరే