Coronavirus: యూరోప్ లో కరోనా కల్లోలం.. ఈ శీతాకాలంలో భారీ మరణాలు అంచనా వేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ!

|

Nov 23, 2021 | 9:17 PM

కరోనా మహమ్మారి ఇప్పటికీ ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో విధ్వంసం సృష్టిస్తోంది. అందులో యూరప్ ఒకటి. ఐరోపా ఇంకా కరోనా పట్టులో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

Coronavirus: యూరోప్ లో కరోనా కల్లోలం.. ఈ శీతాకాలంలో భారీ మరణాలు అంచనా వేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ!
Coronavirus
Follow us on

Coronavirus: కరోనా మహమ్మారి ఇప్పటికీ ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో విధ్వంసం సృష్టిస్తోంది. అందులో యూరప్ ఒకటి. ఐరోపా ఇంకా కరోనా పట్టులో ఉందని, పరిస్థితి ఇలాగే ఉంటే, ఈ శీతాకాలంలో ఈ ఖండంలో మరణించే వారి సంఖ్య 22 లక్షలు కావచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) మంగళవారం తెలిపింది. ఐరోపాలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా, రాబోయే నెలల్లో సుమారు 7,00,000 మంది ప్రాణాలు కోల్పోవచ్చని డబ్ల్యూహెచ్‌ఓ(WHO) తెలిపింది. ఇప్పటి నుండి మార్చి 1, 2022 మధ్య, 53 దేశాలలో 49 దేశాలు ఐసీయూలో అధిక లేదా తీవ్రమైన ఒత్తిడిని కలిగి ఉండవచ్చని డబ్ల్యూహెచ్‌ విశ్వసిస్తోంది. దీంతో మృతుల సంఖ్య కూడా 22 లక్షలు దాటే అవకాశం ఉంది.

కరోనా కేసులు ఎందుకు పెరుగుతున్నాయి?

డబ్ల్యూహెచ్‌ఓ(WHO) ప్రకారం, ఐరోపా, మధ్య ఆసియాలో మరణాలకు కరోనా ఒక ప్రధాన కారణం. డెల్టా వేరియంట్‌లు, వ్యాక్సినేషన్ లేకపోవడం, మాస్క్‌లు ధరించకపోవడం సామాజిక దూరం పాటించడం వంటి విషయాలలో నిర్లక్ష్యం వంటి కారణాల వల్ల యూరప్‌లో కరోనా కేసుల పెరుగుదల కనిపిస్తోంది. డబ్ల్యూహెచ్‌ఓ డేటా ప్రకారం, కోవిడ్ సంబంధిత మరణాలు గత వారం రోజుకు 4,200కి పెరిగాయి. సెప్టెంబర్ చివరి నాటికి ఈ సంఖ్య 2,100గా ఉంది. డబ్ల్యూహెచ్‌ఓ యూరప్ రీజినల్ డైరెక్టర్ హన్స్ క్లూగే ఒక ప్రకటనలో, “యూరప్, మధ్య ఆసియాలో కోవిడ్ -19 పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. మేము సవాలుతో కూడిన శీతాకాలాన్ని ఎదుర్కొంటున్నాము. ” దీనిని నివారించేందుకు వ్యాక్సిన్ ప్లస్ విధానాన్ని అవలంబించాలని విజ్ఞప్తి చేశారు.

భారతదేశంలో కరోనా పరిస్థితి

ఇక భారతదేశంలో కరోనా పరిస్థితి గురించి పరిశీలిస్తే.. గత 24 గంటల్లో ఇక్కడ 7,579 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది గత 543 రోజులలో అతి తక్కువ. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,45,26,480కి చేరింది. ఈ కాలంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,13,584కి తగ్గింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం, గత 24 గంటల్లో 236 మంది కరోనా కారణంగా మరణించారు, ఇందులో కేరళలో మాత్రమే 75 మరణాలు ఉన్నాయి. కేరళలో గత 24 గంటల్లో 3,698 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి: Vodafone Idea Tariff Hike: కస్టమర్లకు షాకివ్వనున్న వొడాఫోన్ ఐడియా.. భారం కానున్న ప్రీపెయిడ్ ప్లాన్‌లు.. ఎప్పటి నుంచో తెలుసా?

Joker Virus: యూజర్లు అలర్ట్.. జోకర్‌ వైరస్‌ మళ్లీ వచ్చింది.. మీ ఫోన్‌లో ఈ 15 యాప్స్‌ ఉంటే వెంటనే తొలగించండి