పేలుళ్లతో దద్దరిల్లిన మెక్సికో..ఏడుగురు దుండగులు హతం

|

Dec 18, 2019 | 12:00 PM

అమెరికాలో గన్‌ కల్చర్‌ రాజ్యమేలుతోంది. నిత్యం ఏదో ఓ ప్రాంతం పేలుళ్లతో దద్దరిల్లుతూనే ఉంది. తుపాకీ తూటాలకు ఎంతోమంది అమాయకులు బలైపోతూనే ఉన్నారు. తాజాగా మెక్సికోలో కాల్పులకు తెగబడ్డారు దుండగులు. దీంతో పోలీసులు వారిపై ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఏడుగురు ముష్కరులు హతమవగా.. ఓ పోలీస్‌ అధికారి మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలవడంతో హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్వానాజువాటో నగరంలో పైపుల నుంచి సరఫరా అయ్యే ఇంధనాన్ని కొన్ని దోపిడీ ముఠాలు చోరీ చేస్తున్నాయి. […]

పేలుళ్లతో దద్దరిల్లిన మెక్సికో..ఏడుగురు దుండగులు హతం
Follow us on

అమెరికాలో గన్‌ కల్చర్‌ రాజ్యమేలుతోంది. నిత్యం ఏదో ఓ ప్రాంతం పేలుళ్లతో దద్దరిల్లుతూనే ఉంది. తుపాకీ తూటాలకు ఎంతోమంది అమాయకులు బలైపోతూనే ఉన్నారు. తాజాగా మెక్సికోలో కాల్పులకు తెగబడ్డారు దుండగులు. దీంతో పోలీసులు వారిపై ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఏడుగురు ముష్కరులు హతమవగా.. ఓ పోలీస్‌ అధికారి మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలవడంతో హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

గ్వానాజువాటో నగరంలో పైపుల నుంచి సరఫరా అయ్యే ఇంధనాన్ని కొన్ని దోపిడీ ముఠాలు చోరీ చేస్తున్నాయి. దీంతో వారిపై నిఘా పెట్టిన అధికారులు..పెట్రోలింగ్‌ ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా గ్వానాజువాటోలో పెట్రోలింగ్‌ వాహనంపై దుండగులు కాల్పుల వర్షం కురిపించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులకు దిగి ఏడుగురిని మట్టుబెట్టాయి. ఇటీవల వరుసగా జరిగిన కాల్పుల్లో మొత్తం 12మంది పోలీస్‌ అధికారులు మృతి చెందారు.